అదృష్టం బాలేక కాదు..

మార్కులున్నాయి.. ఇంటర్వ్యూకు బాగా కష్టపడుతున్నారు. కనిపించిన ప్రతి సంస్థకీ దరఖాస్తు చేస్తున్నా ఉద్యోగం రావట్లేదు!

Published : 28 Jul 2023 00:17 IST

మార్కులున్నాయి.. ఇంటర్వ్యూకు బాగా కష్టపడుతున్నారు. కనిపించిన ప్రతి సంస్థకీ దరఖాస్తు చేస్తున్నా ఉద్యోగం రావట్లేదు! ‘ఛీ అదృష్టం బాలేదు’ అనేసుకుంటున్నారా? సరైన దారిలో వెతక్కపోవడం.. నైపుణ్యాలు తగ్గడమూ కారణమే అంటున్నారు నిపుణులు..

  • ఏటా లక్షల్లో నిరుద్యోగులు జాబ్‌ మార్కెట్‌లోకి వస్తున్నారు. తక్కువ పోస్టులు.. దరఖాస్తు చేసేవారేమో వేలు, లక్షల్లో. కాబట్టి, అర్హతలు మాత్రమే ఉంటే సరిపోదు. సంస్థ చూస్తున్న నైపుణ్యాలను చెక్‌ చేసుకొని.. అవి మీలో ఎంతవరకూ ఉన్నాయో సరిచూసుకోండి.
  • సంస్థలు కొత్తవారిని తీసుకొని మొదట్నుంచీ శిక్షణ ఇవ్వడం కంటే.. అనుభవం ఉన్నవారిని ఎంచుకోవడం మేలనుకుంటాయి. తొలి ఉద్యోగం అనుభవమెలా అంటారా? ఉద్యోగ ప్రయత్నాలు చేస్తూనే ఇంటర్న్‌షిప్‌, సంబంధిత ఆన్‌లైన్‌ కోర్సులు చేయండి. రెజ్యూమెకు అదనపు విలువ చేకూరుతుంది.
  • అవకాశాలు తెలియాలంటే సంబంధిత సంస్థల వెబ్‌సైట్‌లకు వెళ్లడం, ఉద్యోగావకాశాలు చూపే వెబ్‌సైట్లలో నమోదు చేసుకుంటే సరిపోదు. ప్రొఫెషనల్స్‌తో పరిచయాలు చేసుకోండి. సోషల్‌ మీడియాలోనూ దీనికి సంబంధించిన గ్రూపులు ఉంటున్నాయి. వాటిల్లో చేరినా ఖాళీల వివరాలు తెలుస్తాయి.
  • రెజ్యూమె సరిగానే ఉందా? ఆకర్షణీయంగా లేని కవర్‌ లెటర్‌, వివరాలు పొందు పరిచే విధానం కూడా స్క్రీనింగ్‌ దశను దాటలేవు. ఇవన్నీ దాటినా.. ఇంటర్వ్యూలో పోతోందా? అతిగా భయపడటం.. కంగారు.. మధ్యలోనే ఆగిపోవడం.. ఇవన్నీ మీరు సిద్ధంగా లేరనే సంకేతాలిస్తాయి. అలాంటప్పుడూ ఉద్యోగం ఇవ్వరు. ఇవన్నీ సరిచూసుకొని ప్రయత్నించండి.. కొలువులో సులువుగా కుదురుకోగలుగుతారు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని