జ్ఞాపకాలు బాధిస్తున్నాయా?
ఏ బంధం అయినా శాశ్వతంగా దూరమవుతుంది అంటే బాధగానే ఉంటుంది. ముఖ్యంగా అమ్మాయిలు వాళ్ల భావాలను బయటకు చెప్పుకోలేక ఒంటరితనాన్ని అనుభవిస్తుంటారు. మరోవైపు ఆ జ్ఞాపకాలను మరచిపోలేక... కొత్త బంధంలోకి అడుగుపెట్టలేక సతమతమవుతారు.
ఏ బంధం అయినా శాశ్వతంగా దూరమవుతుంది అంటే బాధగానే ఉంటుంది. ముఖ్యంగా అమ్మాయిలు వాళ్ల భావాలను బయటకు చెప్పుకోలేక ఒంటరితనాన్ని అనుభవిస్తుంటారు. మరోవైపు ఆ జ్ఞాపకాలను మరచిపోలేక... కొత్త బంధంలోకి అడుగుపెట్టలేక సతమతమవుతారు. ఇలా ఎంతకాలం? ఆ స్థితి నుంచి త్వరగా బయటపడాలి అనుకుంటున్నారా...
* చాలా మంది విడిపోయిన తర్వాత వాళ్లిచ్చిన బహుమతులను చూసుకుని బాధ పడుతుంటారు. గదిలోంచి బయటి రాకుండా వారి జ్ఞాపకాలతోనే బతుకుతుంటారు. మీకంటూ ఒక జీవితం ఉంటుందని మరచిపోకండి. గతాన్ని గుర్తుచేసే వాటిని తీసి పక్కన పెట్టేయండి.
* ఎవరేం అనుకుంటారో, జడ్జ్ చేస్తారనో బాధను అదిమిపెట్టొదు. మనసు బరువు తగ్గేంతలా ఏడ్వండి. తర్వాత మీపై మీరు దృష్టి పెట్టాలి. మీతో మీరు సమయం గడపడానికి ప్రయత్నించండి. కామెడీ, కామిక్ సినిమాలను చూడండి. మనసు కాస్త కుదుటపడుతుంది.
* వాళ్లని మరచిపోలేక ఆత్మహత్యకు యత్నించడం, మిమ్మల్ని మీరు గాయపరచుకోవడం, చీకటి గదిలో మిగిలిపోవడం చేస్తే మీకే కాదు మిమ్మల్ని నమ్ముకున్న కుటుంబానికీ దుఃఖం మిగిల్చిన వారవుతారు. బయటికి రండి. ఆధ్యాత్మిక చింతన, యోగా లాంటివాటిని వ్యాపకాలుగా మార్చుకోండి.
* ఒత్తిడి, ఆందోళన, మానసిక సమస్యలకు గురవుతున్నామనుకుంటే మానసిక నిపుణులను కలవండి. వాళ్లదగ్గర మీలాంటివారివి ఎన్నో అనుభవాలు ఉంటాయి. వాటిని వినడంతోనైనా మీ పరిస్థితిలో మార్పు వస్తుంది.
* చేస్తున్న ప్రయత్నాలన్నీ మీ జీవితాన్ని మీరు సరిదిద్దుకోడానికి వేసుకుంటున్న అడుగులుగా భావించండి. ఎవరేం అన్నా పట్టించుకోకుండా ముందుకు వెళ్లండి. ఏం చేసినా.. అనేవాళ్లు ఎప్పుడూ చుట్టూ ఉంటారని మరచిపోకండి.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.