ఎక్కడివక్కడే మర్చిపోండి..

పనిచేసే చోట హుందాగా నడుచుకోవడం అందరి బాధ్యత. గాసిప్స్‌కి తావిచ్చి, ఒకరిపై ఒకరు చెవులు కొరుక్కునే విధానం అప్పటికి సంతృప్తినిచ్చినా, తర్వాత మీ నడవడిక మీదే చెడు ప్రభావం పడుతుంది. కాబట్టి వీటికి దూరంగా ఉండమంటున్నారు నిపుణులు..  

Published : 31 Jul 2023 00:17 IST

పనిచేసే చోట హుందాగా నడుచుకోవడం అందరి బాధ్యత. గాసిప్స్‌కి తావిచ్చి, ఒకరిపై ఒకరు చెవులు కొరుక్కునే విధానం అప్పటికి సంతృప్తినిచ్చినా, తర్వాత మీ నడవడిక మీదే చెడు ప్రభావం పడుతుంది. కాబట్టి వీటికి దూరంగా ఉండమంటున్నారు నిపుణులు..  

  • ఇంట్లో అత్తో, భర్త కోప్పడ్డారనో, తిట్టారనో ఆఫీస్‌కి వచ్చి చర్చలు పెడుతుంటారు కొందరు. ఇదే విషయమై పదేపదే మాట్లాడితే వాళ్లతో పాటు మీ గౌరవాన్ని కోల్పోతారు. కాబట్టి ఎక్కడి విషయాలు అక్కడ వదిలేస్తేనే విధులకు ఎలాంటి ఆటంకం లేకుండా మీ బాధ్యతలు నిర్వర్తించగలరు.
  • ఆఫీసులో బాస్‌ ఉన్నప్పుడు ఒకలా, లేనప్పుడు ఒకలా నడుచుకుంటారు కొందరు. వాళ్లముందు పొగుడుతూ, లేనప్పుడు తిడుతూ ఉంటారు. ఇది మీ వ్యక్తిత్వానికే చేటు తెస్తుంది. మనిషి ఉన్నా, లేకున్నా ఒకేలా మాట్లాడే విధానమే మంచి ప్రవర్తనకు దోహదం చేస్తుంది.
  • కొంతమంది ఎక్కడ విన్న విషయాలు అక్కడ మరచిపోరు. వాటిని వేరేవాళ్లకు పంచుతూ ఉంటారు. దీనివల్ల వాళ్లదే కాదు మీ సమయమూ వృథానే. పర్యవసానంగా పనిలో వెనకబాటుతనం తప్ప ఒరిగేది ఏమీ లేదు. అందుకే ఎక్కడి విషయాలు అక్కడే మరచిపోతే మంచిది.
  • ఒక్కోసారి మనం బాగానే ఉన్నా పక్కవారితో జరిగే పరస్పర చర్చల్లో ఇలాంటివి వస్తుంటాయి. వాటి నుంచి తప్పించుకోడానికి ప్రయత్నించండి. అలాంటివి వినేందుకు సమయం లేదనో, ఇంకేదైనా పని ఉందనో చెప్పి వెళ్లిపోడానికి ప్రయత్నించండి. లేదా మాట్లాడుతున్న అంశాన్ని మార్చి ఉపయోగకరమైన టాపిక్‌వైపు మళ్లించే ప్రయత్నం చేయండి.
  • ఎక్కువగా గాసిప్స్‌ చెప్పేవాళ్లు ఉన్న ప్రదేశాల్లోకి వెళ్లకపోవడమే మంచిది. ఒకవేళ వెళ్లాల్సి వస్తే, ఫోన్‌ని ఆసరా చేసుకోండి. మాట్లడటమో, టెక్స్ట్‌, రికార్డ్సు చూడటమో చేస్తే మీ బిజీని చూసి వాళ్లు దగ్గరకు రారు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని