వారంలో ఒకరోజు బంద్‌

వారమంతా పనిచేసేఉద్యోగినులు వారాంతం ఎప్పుడొస్తుందా అని ఎదురుచూడటం సహజమే. తీరా సెలవు రోజునా ప్రాజెక్టులు, ఇంటి పనులు అంటూ తీరిక లేకుండా గడిపేస్తుంటారు.

Published : 03 Aug 2023 00:07 IST

వారమంతా పనిచేసేఉద్యోగినులు వారాంతం ఎప్పుడొస్తుందా అని ఎదురుచూడటం సహజమే. తీరా సెలవు రోజునా ప్రాజెక్టులు, ఇంటి పనులు అంటూ తీరిక లేకుండా గడిపేస్తుంటారు. మరి ఒత్తిడి, ఆందోళన, అలసట ఇంకెలా తగ్గుతాయి. వీటన్నిటికీ బ్రేక్‌ పడాలంటే ఇలాచేసి చూడండి...

  • సెలవు రోజున ఫోన్‌ను పక్కన పెట్టేయండి. ఒక నిర్ణీత సమయాన్ని పెట్టుకుని అప్పుడే చూడండి. మిగిలిన వేళంతా ఇంట్లో వాళ్లతో గడపండి. వాళ్లకీ టైం ఇచ్చినట్లు అవుతుంది. మీకూ సాంత్వన దొరుకుతుంది.
  • ఫోన్‌ నుంచి బయటపడటానికి ఆసక్తి ఉన్న కళలను నేర్చుకోండి. కాస్త సమయాన్ని కేటాయించుకొని దానిపై దృష్టి పెట్టండి. పెయింటింగ్స్‌ వేయడం, క్రాఫ్ట్స్‌ చేయడం లాంటివి నేర్చుకుంటే పిల్లల్ని కూడా అందులో భాగస్వామ్యం చేయొచ్చు.
  • వారంలో ఒకరోజు ఫోన్‌ బంద్‌ అని చెప్పండి. ఇల్లు శుభ్రం చేయడం, కలిసి ఏదైనా సినిమా చూడండి, గార్డెనింగ్‌ చేయండి. ఒత్తిడి దూరమై పిల్లలు, భర్త భాగస్వామ్యంతో మీ పనీ సులువవుతుంది.
  • దగ్గర్లో ఉన్న పార్కులను, ఎగ్జిబిషన్లను సందర్శించండి. డిజిటల్‌ పేమెంట్ల జోలికి పోకుండా, నగదును వెంట తీసుకెళ్లండి. బడ్జెట్‌ నియంత్రణ కూడా ఉంటుంది.
  • ఎక్కువ అలసిపోకుండా.. త్వరగా తొందరగా నిద్రపోండి. దీనివల్ల మరుసటి రోజు ఏ చింతా లేకుండా ఆఫీసుకి వెళ్లొచ్చు.
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్