ఫోన్‌ ఇంటర్వ్యూనా..

నవ్య ఎన్ని ఉద్యోగాలకు అప్లై చేసినా ఫోన్‌ ఇంటర్వ్యూ స్థాయిలోనే ఫెయిల్‌ అవుతోంది. ఇలా కావడానికి కారణమేంటో చెబుతున్నారు నిపుణులు...

Published : 12 Aug 2023 00:02 IST

నవ్య ఎన్ని ఉద్యోగాలకు అప్లై చేసినా ఫోన్‌ ఇంటర్వ్యూ స్థాయిలోనే ఫెయిల్‌ అవుతోంది. ఇలా కావడానికి కారణమేంటో చెబుతున్నారు నిపుణులు...

ప్రతి సంస్థ ఇప్పుడు మొదట ఫోన్‌లోనే అభ్యర్థితో మాట్లాడి రెండో దశలో ఇంటర్వ్యూకి పిలుస్తున్నాయి. ఫోన్‌ ఇంటర్వ్యూ అనగానే తేలికే.. అనుకోకుండా ముందుగానే సిద్ధమవ్వాలి. ఇంటర్వ్యూ ఉందని సంస్థ నుంచి సమాచారం అందినప్పుడు ఆ తేదీ, సమయం వంటివన్నీ గుర్తుంచుకోవాలి. విద్యార్హతకు సంబంధించిన సంవత్సరం, కోర్సుల వివరాలను పుస్తకంలో రాసుకోవాలి. అలాగే వారు ఫోన్‌ చేసే సమయానికి అందుబాటులో ఉండాలి.  సిగ్నల్‌ సరిగా ఉండే ప్రదేశాన్ని ఎంచుకుంటే  మధ్యలో ఆటంకం కలగదు.

అధ్యయనం..  పలకరింపు మర్యాద పూర్వకంగా ఉండాలి. సంభాషణలో స్పష్టత ఉండాలి. మాట  తడబడకూడదు. ఫలానా కోర్సు చదవడానికి కారణం, చదువు తర్వాత లేదా గత ఉద్యోగానికి ఇప్పటికి వచ్చిన విరామ కారణాన్ని స్పష్టంగా చెప్పాలి. మాట్లాడేటప్పుడు పదాల ఎంపికతోపాటు ఉచ్చారణ బాగుండాలి. ప్రశ్నకు తగిన సమాధానాన్ని మాత్రమే చెప్పాలి.

మరోసారి..  సదరు సంస్థ వివరాలు, అభివృద్ధి, మార్కెట్‌లో దాని స్థానంపై ముందుగానే అధ్యయనం చేయాలి. అప్పుడే దరఖాస్తుకు గల కారణాన్ని అడిగితే కెరియర్‌లో అభివృద్ధి చెందడానికి ఆ సంస్థ మీకెలా తోడ్పడుతుందో చెప్పగలరు. హడావుడిగా లేదా అతి నెమ్మదిగా కాకుండా మీ గొంతులో ఆత్మవిశ్వాసం కనిపించాలి. వారడిగిన ప్రశ్న అర్థంకాకపోతే సౌమ్యంగా మరోసారి అడిగి తెలుసుకొని సమాధానం చెప్పాలి. అలాగని ప్రతి ప్రశ్నకూ ఈ విధానాన్ని పాటించకూడదు. అలాగే ఇంటర్వ్యూ అంటే టెన్షన్‌ అనిపిస్తే ఒకటి రెండు రోజుల ముందు నుంచే మాక్‌ ఇంటర్వ్యూలను సాధన చేయడం మంచిది. ఇది అసలైన సందర్భంలో ఉపయోగపడుతుంది. చివర్లో థ్యాంక్స్‌ మరవకూడదు. ఇలా ముగించే ఇంటర్వ్యూ మిమ్మల్ని రెండో దశకు ఎంపిక చేయడం ఖాయం.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్