నలుగురూ మెచ్చేలా

కొందరు కనిపించిన ప్రతి ఒక్కరినీ పలకరిస్తుంటారు. కొందరిని మాత్రం అవతలి వాళ్లే పిలిచిమరీ మాట్లాడతారు. చుట్టూ చేరి మాట కలపాలని చూస్తారు. ఆఫీసులో సాధారణంగా కనిపించే సీనే ఇది. నలుగురినీ మెప్పించే ఆ మాయ కావాలా.. వీటిని ప్రయత్నించమంటున్నారు నిపుణులు.

Published : 14 Aug 2023 00:11 IST

కొందరు కనిపించిన ప్రతి ఒక్కరినీ పలకరిస్తుంటారు. కొందరిని మాత్రం అవతలి వాళ్లే పిలిచిమరీ మాట్లాడతారు. చుట్టూ చేరి మాట కలపాలని చూస్తారు. ఆఫీసులో సాధారణంగా కనిపించే సీనే ఇది. నలుగురినీ మెప్పించే ఆ మాయ కావాలా.. వీటిని ప్రయత్నించమంటున్నారు నిపుణులు.

  • ఎదుటివారు మాట్లాడుతుంటే మధ్యలో ఆపేయడం, దూరడం లాంటివి చేస్తున్నారా? ఇంకెలా ఇష్టపడతారండి? ఎదుటివారు చెప్పేదాన్ని పూర్తిగా వినండి. వాళ్ల అభిప్రాయాలకు విలువ ఇవ్వండి. వాళ్లెవరితోనైనా మాట్లాడుతోంటే కదిలించడం, మధ్యలోకి వెళ్లి మీరు చెప్పాలనుకున్నది చెప్పడం లాంటివన్నీ మీమీద వ్యతిరేకత నింపేవే. మాట్లాడేప్పుడు గొంతునూ చూసుకోండి. అవతలి వాళ్లను తక్కువ చేసే విషయాలను పెద్దగా మాట్లాడటం, అవసరానికి వచ్చేసరికి నెమ్మదిగా మాట్లాడటం వంటివి ఎవరూ హర్షించరు. వీటిని గమనించుకోండి.
  • కావాలని పొగిడే మాటలు ఎదుటివారికి అర్థమవుతాయి. అప్పటికి వాళ్లు చిరనవ్వు చిందించినా మీ మాటపై ఏర్పడేది అపనమ్మకమే. నిజంగా అవతలి వ్యక్తిలో నచ్చిన అంశాలున్నాయా.. కితాబు ఇవ్వండి. అయితే అది కావాలని చేసినట్టో ముఖస్తుతి కోసమో చేయొద్దు. మనస్ఫూర్తిగా ఇవ్వండి. వాళ్లూ మీపై అభిప్రాయాన్ని మార్చుకుంటారు.
  • నిజం మాట్లాడండి. మీరు తప్పించు కోవడానికో, మీ లాభం కోసం మాట్లాడే అబద్ధాలు మీపై గౌరవాన్ని పోగొడతాయి. మీరు తర్వాత నిజమే చెప్పినా దానికి విలువుండదు. ప్రతిదానిలో నాకేం లాభం అని చూసుకునే వారినీ ఎవరూ మెప్పించరు. ఆ తీరునీ చెక్‌ చేసుకోవాలి.
  • మిమ్మల్ని మీరు ఎక్కువ చేసుకోవద్దు, తక్కువ చేసుకోవద్దు. ఇలాంటివీ మిమ్మల్ని పక్కన పెట్టేలా చేసేవే. ఆత్మవిశ్వాసంతో ఉండాలి, నేర్చుకోవడానికి సిద్ధంగా ఉండాలి. అలాంటివారినే ఎక్కువమంది అభిమానిస్తారు. ప్రతిదాన్నీ సానుకూలంగా తీసుకోగలగాలి. ఇతరులతో కలిసిపోవాలి. అవతలివారి కోణం నుంచి ఆలోచించగలగాలి. మొత్తంగా వీళ్లతో కలిసి పనిచేయడం ఆనందదాయకం అనిపించగలగాలి. ఈ గుణాలను చెక్‌ చేసుకోండి. అవసరమైతే మార్పులు చేసుకోండి. అభిమానించేవారు పెరుగుతారు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్