వ్యాపారవేత్తగా రాణించాలా..
యువ వ్యాపారవేత్తలు అనుకున్నట్లుగా సక్సెస్ కాకపోతే తీవ్ర నిరుత్సాహానికి గురవుతుంటారు. పూర్తిగా ఆలోచించకుండా నిర్ణయం తీసుకున్నామని మధనపడతారు. దీనికి కొన్ని వ్యూహాలు అనుసరించాలంటున్నారు నిపుణులు.
యువ వ్యాపారవేత్తలు అనుకున్నట్లుగా సక్సెస్ కాకపోతే తీవ్ర నిరుత్సాహానికి గురవుతుంటారు. పూర్తిగా ఆలోచించకుండా నిర్ణయం తీసుకున్నామని మధనపడతారు. దీనికి కొన్ని వ్యూహాలు అనుసరించాలంటున్నారు నిపుణులు.
ఎన్నో కలలతో వ్యాపారం మొదలుపెడితే లాభాలు రాకపోవడం సరికదా.. తీవ్ర నష్టాలు ఎదురవుతాయి. ఆ సమయాన్ని దాటడానికి మానసిక సామర్థ్యం తప్పనిసరి. ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వివిధ రంగాలకు సంబంధించి కావాల్సినంత సమాచారం లభ్యమవుతోంది. ఏ రంగంలోనైనా విజయాలెలా సాధించొచ్చు అనేదానిపై శిక్షణ తీసుకోవచ్చు. అవగాహన పెంచుకోవచ్చు. ప్రముఖులు, ఆయా రంగాలకు చెందిన నిపుణులు తమ అనుభవాలను పాఠాలుగా చెబుతున్నారు. వాటిని అనుసరిస్తే ప్రయోజనం ఉంటుంది. వైఫల్యం ఎదురైందనే మానసికాందోళన నుంచి బయటపడటానికి కౌన్సెలింగ్ అత్యవసరం. మానసిక నిపుణుల సలహాలు తీసుకోవడం మంచిది.
నిపుణులతో.. నిరంతరం వ్యాపారం, కెరియర్ అంటూ ఆలోచిస్తే పరిష్కారం కన్నా ఆందోళన, ఒత్తిడి దరి చేరతాయి. ఓ పది రోజులు బ్రేక్ తీసుకొని, ఈ రంగం గురించి తెలిసిన వాళ్లను వెళ్లి కలుసుకోవాలి. వారు ప్రారంభంలో ఎటువంటి ఒడుదొడుకులెదుర్కొన్నారో అడిగి తెలుసుకోవాలి. వారి అనుభవాలను, సవాళ్లనెలా అధిగమించారు వంటివి మాట్లాడి అవగాహన తెచ్చుకోవాలి. చేసిన పొరపాట్లను గుర్తించి, వాటిని సరిదిద్దుకోవడమెలాగో తెలుసుకోవాలి. ఇలా అనుభవజ్ఞులను కలుసుకున్నప్పుడు వారి నుంచి స్ఫూర్తిని పొందొచ్చు. వారిచ్చే ప్రోత్సాహాన్ని తిరిగి ఉత్సాహంగా మార్చుకొని కెరియర్ కొనసాగించడానికి ప్రయత్నించాలి.
నైపుణ్యాలు.. వ్యాపారరంగానికి కావాల్సిన నైపుణ్యాలేంటో తెలుసుకోవాలి. చదువు, పెట్టుబడి ఉంటే సరిపోదు. పలురకాల నైపుణ్యాలు, అనుభవాలు ఉంటేనే విజయం సాధించొచ్చు. అలాగే వ్యాపారిగా నిలవాలన్నా, ఆఫీసు లేదా ఫ్యాక్టరీలో మిగతావారు కూడా తమ బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించాలన్నా యజమానిగా ముందు కొన్ని నియమాలను పాటించాల్సి ఉంటుంది. వాటిలో సమయపాలన, క్రమశిక్షణ అత్యంత ముఖ్యమైనవి. సమయాన్ని వృథా చేయకుండా ఉండటం నేర్చుకోవాలి. క్రమశిక్షణగా ఆయా పనులను పట్టికగా ఉంచి ప్రాముఖ్యతను బట్టి వరసగా పూర్తిచేయడానికి కృషి చేయాలి. వీటన్నింటితోపాటు ఈ కెరియర్‌కు సంబంధించిన పుస్తకాలు చదవడం ద్వారా మరిన్ని కొత్త విషయాలను తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. వీటన్నింటితో ధైర్యంగా అడుగు ముందుకేయొచ్చు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.