మొదటిసారి ఇంటర్వ్యూ...

కోరుకున్న కంపెనీ నుంచి ఇంటర్వ్యూకి రమ్మని కాల్‌ వచ్చింది. వెళ్లాలని ఉంది. కానీ లోపల ఏదో తెలియని ఆందోళన మొదలవుతుంటుంది. ఆ టెన్షన్‌లో తెలిసిన సమాధానాలు కూడా తప్పుగా చెప్పే సందర్భాలు ఎదురవుతుంటాయి.

Published : 26 Aug 2023 01:15 IST

కోరుకున్న కంపెనీ నుంచి ఇంటర్వ్యూకి రమ్మని కాల్‌ వచ్చింది. వెళ్లాలని ఉంది. కానీ లోపల ఏదో తెలియని ఆందోళన మొదలవుతుంటుంది. ఆ టెన్షన్‌లో తెలిసిన సమాధానాలు కూడా తప్పుగా చెప్పే సందర్భాలు ఎదురవుతుంటాయి. వాటి నుంచి బయటపడాలంటే ఇలా చేయండి..

ఇంటర్వ్యూకి వెళ్లే ముందు ఎలాంటి ప్రశ్నలు అడుగుతారో అనే ఆందోళన చాలా మందిలో ఉంటుంది. అలాంటప్పుడు ఆ కంపెనీ గురించి ముందుగానే తెలుసుకునే ప్రయత్నం చేయండి. లేదా అందులో పని చేసే వారితో ఓసారి మాట్లాడండి. మీ సందేహలను అడిగి దానికి తగినట్లు మిమ్మల్ని మీరు ముందుగానే సిద్ధం చేసుకొంటే ఏ భయం ఉండదు.

కొంతమంది ఇంటర్వ్యూకి వెళ్లినప్పుడు ఏమీ తినకుండా వెళ్తారు. అలా అస్సలు చేయొద్దు. ఎందుకంటే ఉదయం తిన్న అల్పాహారం మంచి శక్తినిస్తుంది. మెదడు కూడా చురుగ్గా పని చేస్తుంది. ఇంటర్వ్యూని ఉత్సాహంతో పూర్తిచేస్తారు.

ఉద్యోగం వస్తుందా రాదా అనే కంగారు లోలోపల ఉంటే స్నేహితులతోనో, కుటుంబ సభ్యులతోనో ఫోన్‌ చేసి మాట్లాడండి. ఇలా చేస్తే మనసుకు చాలా హాయిగా ఉంటుంది. ఆందోళన కలిగించే ఆలోచనలు దూరమవుతాయి.

ఇంటర్వ్యూకి వెళ్లే ముందు అద్దంలో ఓసారి అక్కడ ఎలా మాట్లాడాలో రిహార్సల్‌ చేసుకోండి. మీకు భయం పోతుంది

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్