ఎక్కువ సేపు కూర్చొంటున్నారా...

మనలో చాలా మంది ఎంపిక డెస్క్‌ ఉద్యోగాలే! అంటే.. రోజులో కనీసం 6 - 7 గంటలు కూర్చొనే ఉంటాం. ఇది దీర్ఘకాలంలో అనేక సమస్యలకు దారితీస్తుందని తెలుసా? కాబట్టి..

Published : 30 Aug 2023 04:42 IST

మనలో చాలా మంది ఎంపిక డెస్క్‌ ఉద్యోగాలే! అంటే.. రోజులో కనీసం 6 - 7 గంటలు కూర్చొనే ఉంటాం. ఇది దీర్ఘకాలంలో అనేక సమస్యలకు దారితీస్తుందని తెలుసా? కాబట్టి..

  • ఎక్కువ సేపు కూర్చొని పనిచేసే వాళ్లు ఉదయం లేవగానే రివర్స్‌ ప్లాంక్స్‌ చేయాలి. దీనివల్ల కాళ్లు, శరీరంలోని కండరాలన్నీ బలోపేతం అవుతాయి. మూడు నుంచి ఐదు నిమిషాలు దీన్ని చేయడం వల్ల నడుము, వెన్ను, తుంటి సమస్యల నుంచి బయటపడొచ్చు.
  • వెన్నెముక ఆరోగ్యానికి స్పైనల్‌ ట్విస్ట్‌ వ్యాయామం ఎంతగానో ఉపయోగపడుతుంది. వయసుతో పాటు వెన్నెముకలో ఏర్పడే ఖాళీని ఇది పూరిస్తుంది. మెడ, భుజం కండరాలకు ఇది మంచి వ్యాయామం. ఈ నొప్పుల నుంచి త్వరిత ఉపశమనాన్ని కలిగిస్తుంది.
  • మెడ, వెన్ను నొప్పి, ఒత్తిడితో సతమతమయ్యే వారు డాగ్‌ పోజ్‌ను చేయాలి. ఈ వ్యాయామంతో కండరాలన్నీ కదిలి శరీరాన్ని ఒత్తిడి నుంచి దూరం చేస్తాయి.
  • విరామ సమయాల్లో స్ట్రెచ్‌, చెస్ట్‌ ఓపెనర్‌ లాంటి వ్యాయామాలు చేయండి. మెడ, తలనొప్పుల నుంచి ఉపశమనం దొరుకుతుంది. ప్రతి గంటకోసారి అయినా లేచి 5 నిమిషాలు నడవాలని అధ్యయనాలూ చెబుతున్నాయి.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని