ఇల్లు.. ఉద్యోగం బ్యాలెన్స్‌ చేద్దామిలా..

కుటుంబం, కెరియర్‌ ఈ రెండింటిని సమతుల్యం చేసుకుంటేనే ముందుకు సాగగలం. అందుకోసమే ఈ చిట్కాలు...

Updated : 01 Sep 2023 04:39 IST

కుటుంబం, కెరియర్‌ ఈ రెండింటిని సమతుల్యం చేసుకుంటేనే ముందుకు సాగగలం. అందుకోసమే ఈ చిట్కాలు...

గీత ఉండాలి..:  ఇల్లూ, ఆఫీసు పనులకి మధ్య సరైన సమయ విభజన ఉండాలి. ఆ ప్రణాళికను కచ్చితంగా పాటించాలి. సమయాన్ని సద్వినియోగం చేసుకోవడం, ముందు వేసుకున్న షెడ్యూల్‌ ప్రకారం పనులు పూర్తి చేయడం, ప్రాధాన్యతా క్రమాన్ని పాటించడం వంటివి చేయాలి. అలాకాకుండా ఇక్కడ పనులు అక్కడ, అక్కడ పనులు ఇక్కడా చేస్తే రెండు చోట్లా ఒత్తిడికి గురయ్యే అవకాశం ఎక్కువ.

ఎవరికి వారే..: ఇంట్లోనైనా, ఆఫీసులోనైనా మన పని మనం పూర్తి చేయడం, ఎవరి విధుల్ని వారు నిర్వర్తించేలా చూడటం చాలా అవసరం. అప్పుడే మీ మీద ఒత్తిడి ఉండదు.

సౌకర్యంగా...:  ఆఫీసు పనులు పూర్తికాగానే వీలైనంత సమయాన్ని కుటుంబంతో గడపడానికి ప్రాధాన్యం ఇవ్వండి. కనీసం నెలకోసారైనా ఇంట్లో వాళ్లతో కలసి దగ్గర్లోని పార్కుకో, గుడికో, లేదంటే ఊరి చివర చాట్‌ బండి దగ్గరకో సరదాగా వెళ్లిరండి. ఇవి మీ ఒత్తిడినే కాదు... వారి అభద్రతనూ తగ్గిస్తుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్