అతిగా వాడుతున్నారా..
స్మార్ట్‌ఫోన్ల వినియోగంతో మహిళల ఆరోగ్యంపై పడే దుష్ప్రభావాలేంటో తెలిస్తే మీరిక వాటికి దూరంగా ఉంటారు.. ప్రపంచ వ్యాప్తంగా 74 శాతం మంది మహిళలు స్మార్ట్ ఫోన్ వినియోగంతో ఒత్తిడికి లోనై, నిద్రలేమికి గురవుతున్నారని అమెరికాలోని ‘స్పెయిన్ ల్యాబ్స్’ చేసిన అధ్యయనాలు చెబుతున్నాయి.
స్మార్ట్‌ఫోన్ల వినియోగంతో మహిళల ఆరోగ్యంపై పడే దుష్ప్రభావాలేంటో తెలిస్తే మీరిక వాటికి దూరంగా ఉంటారు..
- ప్రపంచ వ్యాప్తంగా 74 శాతం మంది మహిళలు స్మార్ట్ ఫోన్ వినియోగంతో ఒత్తిడికి లోనై, నిద్రలేమికి గురవుతున్నారని అమెరికాలోని ‘స్పెయిన్ ల్యాబ్స్’ చేసిన అధ్యయనాలు చెబుతున్నాయి.
- సామాజిక మాధ్యమాలు, గేమ్స్ వల్ల మగవారితో పోలిస్తే, మహిళలు 29 శాతం అధికంగా ఎక్కువ ఒత్తిడి, ఆందోళనకు గురవుతున్నారు. ఫోటోలు, రీల్స్ అంటూ వ్యక్తిగత గోప్యతను నెట్టింట్లో ఉంచి సమస్యలెదుర్కొంటున్నారు. వాటి నుంచి బయటపడలేక ఆత్మహత్యాయత్నానికి పాల్పడుతున్నారు.
- ఫోన్‌ని పొత్తి కడుపు, ఛాతీ మీద పెట్టుకుని నిద్రపోవడం వల్ల దాని ప్రభావం పునరుత్పత్తి వ్యవస్థపై పడి, అండాశయ నిల్వలు తగ్గుతున్నాయని అధ్యయనాలు చెబుతున్నాయి. నిద్రలేమి, నడుము, వెన్ను, మెడ నొప్పులకు గురవుతున్నారు. నెలసరి క్రమం తప్పి పీసీఓఎస్, పీసీఓడీ సమస్యలతో సతమతమవుతున్నారట.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.