నాజూకు నడుముకి

నడుము, పొట్ట వద్ద కొవ్వు పేరుకుంటే ఎబ్బెట్టుగా ఉంటుంది. నాజూగ్గా ఉండాలంటే ఊర్ధ్వ హస్తాసనం ప్రయత్నించండి. ఈ ఆసనంతో మానసిక ఒత్తిడి కూడా తగ్గుతుంది.

Updated : 16 Sep 2023 12:23 IST

నడుము, పొట్ట వద్ద కొవ్వు పేరుకుంటే ఎబ్బెట్టుగా ఉంటుంది. నాజూగ్గా ఉండాలంటే ఊర్ధ్వ హస్తాసనం ప్రయత్నించండి. ఈ ఆసనంతో మానసిక ఒత్తిడి కూడా తగ్గుతుంది.

నిలబడి చేతులు పైకి ఎత్తాలి. అరచేతులు పైకి వచ్చేలా వేళ్లను కలపాలి. రెండు పాదాలూ దగ్గరగా ఉంచి, నడుము, భుజాలు, తల, చేతులను కుడిపక్కకు వంచాలి. ముందుకు వంగకూడదు. శ్వాస వదులుతూ వీలైనంత వంగి, కొన్ని క్షణాలు ఆ భంగిమలో ఉండాలి. తిరిగి శ్వాస తీసుకుంటూ మధ్యలోకి రావాలి. ఇదే విధంగా ఎడమవైపు చేయాలి. ఇలా మార్చి మార్చి 20 సార్లు.. అంటే కుడివైపు 10, ఎడమవైపు 10 చొప్పున చేయాలి.

ఇవీ ప్రయోజనాలు

ఊర్ధ్వ హస్తాసనం చేయడం వల్ల వెన్ను, భుజాలు సేదతీరుతాయి. శరీరం బిగుసుకుపోదు. నిలబడటంలో అపసవ్యతలు ఉంటే తొలగుతాయి. నడుము, పొట్ట భాగాల్లో పేరుకున్న కొవ్వు చాలా త్వరగా తగ్గుతుంది. జీర్ణప్రక్రియ సజావుగా ఉంటుంది. శ్వాస సమస్యలు నయమవుతాయి. రక్త సరఫరా బాగుంటుంది. కీళ్ల నొప్పులు రావు. నడుమునొప్పి తగ్గుతుంది. ఉద్వేగాలను నియంత్రించుకోగలుగుతారు. ఒత్తిడి, ఆందోళన తగ్గుతాయి.

ఎవరు చేయకూడదు..

సర్జరీ అయినవాళ్లు, కీళ్లనొప్పులు ఉన్నవాళ్లు ఊర్ధ్వ హస్తాసనం చేయకూడదు. చీలమండ, పక్కటెముకలు, భుజాలు, వెన్నుభాగంలో ఇబ్బంది ఉన్నవారు యోగా గురువు ఆధ్వర్యంలో నెమ్మదిగా చేయాలి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని