మీకు మీరే రక్ష!

ఈ మధ్య నెట్టింట్లో వంచనకు గురవుతున్న వారిలో మహిళలే ఎక్కువగా ఉంటున్నారు. అందులోనూ స్మార్ట్‌ఫోన్లు వాడుతున్న గృహిణులే లక్ష్యంగా మోసాలు జరుగుతున్నాయి. వాటి నుంచి కాపాడుకోవాలంటే.. వ్యాపార అవకాశాలు, పార్ట్‌టైం ఉద్యోగాలు, ఇంట్లో ఉండే సంపాదించొచ్చు వంటి కారణాలతో కనిపించిన యాప్‌లూ, సైట్లలోకి వెళ్తున్నారు.

Published : 21 Sep 2023 01:17 IST

ఈ మధ్య నెట్టింట్లో వంచనకు గురవుతున్న వారిలో మహిళలే ఎక్కువగా ఉంటున్నారు. అందులోనూ స్మార్ట్‌ఫోన్లు వాడుతున్న గృహిణులే లక్ష్యంగా మోసాలు జరుగుతున్నాయి. వాటి నుంచి కాపాడుకోవాలంటే..

  • వ్యాపార అవకాశాలు, పార్ట్‌టైం ఉద్యోగాలు, ఇంట్లో ఉండే సంపాదించొచ్చు వంటి కారణాలతో కనిపించిన యాప్‌లూ, సైట్లలోకి వెళ్తున్నారు. కానీ ఆయా సైట్లలోకి వెళ్లే ముందు అవి నిజమైనవా, కావా అని ఆలోచించకుండా వ్యక్తిగత వివరాలు ఇచ్చి సమస్యల పాలవుతున్నారు. అందుకే ఏదైనా సైట్‌ ఓపెన్‌ చేసే ముందు అది నిజమైన సైట్‌ అవునో కాదో చెక్‌ చేసుకోవడం తప్పనిసరి.
  • ఉత్పత్తులు కొనేముందు.. ఒక సారి కామెంట్‌ బాక్స్‌ ఓపెన్‌ చేసిచూడండి. ఒకవేళ అవి నకిలీవైతే బాధితులైనవారు ఎవరైనా అక్కడ సందేశాలు పెడుతుంటారు. అవి చదివితే మీకే తెలిసిపోతుంది.
  • మీ వ్యక్తిగత వివరాలను ఏ సైట్లోనూ ఇవ్వకండి. బ్యాంకు ఖాతాకు సంబంధించిన వివరాలైతే అసలే ఉంచకండి. ఐదు నిమిషాల కంటే ఎక్కువ తెలియని సైట్లను తెరిచి ఉంచొద్దు. హ్యాకింగ్‌ సమస్యలు ఉంటాయి.
  • ఆన్‌లైన్‌ కొనుగోళ్లు చేసేటప్పుడు ఆ ఉత్పత్తి చేతికి అందిన తర్వాత నగదు చెల్లింపు చేస్తే మంచిది. ఈ మధ్య ఒక ఉత్పత్తి చూపించి మరొకటి ఇంటికి పంపిస్తున్నారు. ఇటీవల విరిగినవి, పాడైనవీ వస్తున్నాయి. ఇంటికి ఉత్పత్తి వచ్చాక పరిశీలించిన తర్వాత మాత్రమే డబ్బులు చెల్లించడం మంచిది. వీలుకాని సందర్భంలో వీడియో తీస్తూ ప్యాక్‌ను తెరిస్తే మరీ మంచిది.  
  • ఇన్ని జాగ్రత్తలు పాటించినా కొన్నిసార్లు మోసాలకు బాధితులు అవుతుంటారు. పరువు పోతుందనో, పోయింది తక్కువేగా.. స్టేషన్ల చుట్టూ తిరగడం ఎందుకనో, పెద్దవాళ్లు తిడతారనే భయంతోనో ఆగిపోకుండా దగ్గర్లో ఉన్న సైబర్‌ సెంటర్లలో ఫిర్యాదు చేయండి.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని