థైరాయిడ్‌ సమస్యా..

మనల్ని ఎక్కువ ఇబ్బంది పెట్టే సమస్యల్లో థైరాయిడ్‌ ఒకటి. దీనిని నియంత్రణలో ఉంచాలంటే ‘సేతుబంధాసనం’ ప్రయత్నించండి...

Updated : 23 Sep 2023 12:06 IST

మనల్ని ఎక్కువ ఇబ్బంది పెట్టే సమస్యల్లో థైరాయిడ్‌ ఒకటి. దీనిని నియంత్రణలో ఉంచాలంటే ‘సేతుబంధాసనం’ ప్రయత్నించండి...

ముందుగా వెల్లకిలా శవాసనంలో పడుకోవాలి. ఇప్పుడు కాళ్లను పైకి లేపి పాదాలను నేలపై ఆనించి పిరుదులకి సమాంతరంగా ఉంచాలి. శరీరానికి సమాంతరంగా అరచేతులను నేలపై చాచాలి. నేల నుంచి శరీరాన్ని నెమ్మదిగా పైకి లేపాలి. మీ భుజాలను సర్దుబాటు చేసుకుంటూ కదలకుండా నెమ్మదిగా భుజాలు, చేతులు, కాళ్లపై శరీర బరువు నిలపాలి. గడ్డాన్ని ఛాతీకి తగిలేలా చూసుకోవాలి. శ్వాస తీసుకుని వదలాలి. ఇలా పదిహేను సెకన్లు ఈ ఆసనంలో ఉండాలి. తర్వాత నెమ్మదిగా యథాస్థితికి వచ్చి శవాసనంలో విశ్రాంతి తీసుకోవాలి.

ఉపయోగాలు.. థైరాయిడ్‌ గ్రంథికి చక్కటి మర్దనా జరుగుతుంది. దాని పనితీరు మెరుగుపడుతుంది. కాళ్లు, చేతులు, వెన్నెముక, తుంటి భాగాలు బలోపేతం అవుతాయి. శ్వాస సంబంధిత సమస్యలు నయం అవుతాయి. జుట్టురాలే సమస్య తగ్గుతుంది.

ఎవరు చేయకూడదు.. మెడ, భుజాలు, వెన్నెముక భాగాల్లో గాయాలున్నవారు, సర్వైకల్‌ స్పాండిలైటిస్‌, హెర్నియా సమస్య ఉన్నవారు చేయరాదు. గుండె సంబంధిత వ్యాధులు, అధిక రక్తపోటు ఉన్నవారు డాక్టరు సూచనల మేరకు చేయాలి.

ఆహార నియమాలు.. థైరాయిడ్‌ ఉన్నవారు గ్లూటస్‌ ఎక్కువ ఉండే ఆహారపదార్థాలను తీసుకోకూడదు. కూల్‌డ్రింక్స్‌, క్యాబేజీ, బ్రోకలీ, సోయాబీన్‌ తక్కువగా తీసుకోవాలి.

- శిరీష, యోగా గురు

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని