ఇంకోసారి సమీక్షిద్దామా..

ఇంటా బయటా ఏదో ఒక పనిలో నిమగ్నమయ్యే మహిళలకు ఎక్కడో చోట అపజయం ఎదురవడం సహజమే. కానీ వాటినే ఆలోచిస్తూ బాధపడుతూ ఆ ప్రభావం మిగతా వాటి మీద పడేట్లు చేయడం సమంజసం కాదు.

Published : 01 Oct 2023 01:48 IST

ఇంటా బయటా ఏదో ఒక పనిలో నిమగ్నమయ్యే మహిళలకు ఎక్కడో చోట అపజయం ఎదురవడం సహజమే. కానీ వాటినే ఆలోచిస్తూ బాధపడుతూ ఆ ప్రభావం మిగతా వాటి మీద పడేట్లు చేయడం సమంజసం కాదు. అలాకాకుడదంటే..

  • ఉద్యోగం, వ్యాపారమన్నాక పొరపాట్లు సహజమే! అంతమాత్రాన కుంగిపోవాల్సిన పనిలేదు. మరోసారి చేయకుండా చూసుకోండి చాలు. తప్పిదం ఎక్కడ, ఎలా జరిగిందన్నది సమీక్షించుకోండి. మరోసారి ఆ తప్పు చేయకుండా ఉంటారు. వీలైతే అలాంటి వాటిని ఒక దగ్గర రాసుకోండి. దాన్ని అధిగమించే క్రమాన్నీ జోడిస్తే భవిష్యత్తులో సాయపడతాయి.
  • నలుగురిలో మాట పడటం మన అమ్మాయిలు త్వరగా జీర్ణించుకోలేరు. అందుకని నెపం ఇంకొకరి మీద నెట్టేయొద్దు. అప్పటికి తప్పించుకోగలరు కానీ.. విషయం బయట పడితే మరింత అవమానం. ఇతరుల నమ్మకాన్నీ కోల్పోగలరు. కాబట్టి, నిజాయతీగా ఒప్పుకోండి.. మీపై గౌరవం పెరుగుతుంది.
  • ఇంటి సమస్యలు.. ఆందోళనలు మనల్ని ఒకపట్టాన వదలవు కదా! అవన్నీ ఆలోచనల్లో పెట్టుకొని పనిచేస్తే తప్పులేగా మరి దొర్లేది? పని ప్రదేశంలోకి వెళ్లే ముందే మనసును తేలిక పరచుకోండి. ముఖ్యంగా కోపం, ఆందోళనలో ఉన్నప్పుడు ఏ నిర్ణయమూ తీసుకోవద్దు. వృత్తి జీవితంలోనే కాదు వ్యక్తిగతంగానూ ఈ నియమం తప్పనిసరి.
  • ఆఫీసుల్లో చిన్న పొరపాటైనా ప్రభావం టీమ్‌ మొత్తమ్మీదా పడుతుంది. కాబట్టి, విమర్శలూ వస్తాయి. అంతమాత్రాన వాళ్ల మీద కోపం తగదు. సారీ చెప్పండి. వాతావరణం తేలిక పడటం మీరే గమనిస్తారు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని