వారి విజయం వెనుక...

సుధ, రాధ కలిసి కెరియర్‌లో ఒకేసారి అడుగుపెట్టినా, రాధ లీడర్‌గా ఎదిగితే, సుధ మాత్రం బృందంలో ఒకరిగా మిగిలింది. ఉన్నత స్థానాలను అందుకొని కెరియర్‌లో విజయాలు సాధించేవారు పాటించే కొన్ని నియమాలను నిపుణులు చెబుతున్నారిలా..  నెట్‌వర్క్‌తో... లీడర్స్‌గా ఎదిగేవారి పనెప్పుడూ స్మార్ట్‌గా ఉంటుంది.

Published : 03 Oct 2023 01:41 IST

సుధ, రాధ కలిసి కెరియర్‌లో ఒకేసారి అడుగుపెట్టినా, రాధ లీడర్‌గా ఎదిగితే, సుధ మాత్రం బృందంలో ఒకరిగా మిగిలింది. ఉన్నత స్థానాలను అందుకొని కెరియర్‌లో విజయాలు సాధించేవారు పాటించే కొన్ని నియమాలను నిపుణులు చెబుతున్నారిలా.. 

 

నెట్‌వర్క్‌తో... లీడర్స్‌గా ఎదిగేవారి పనెప్పుడూ స్మార్ట్‌గా ఉంటుంది. వీరు తమ బాధ్యతలను సంపూర్ణంగా నిర్వర్తించడంలో ప్రణాళికాబద్ధంగా వ్యవహరిస్తారు. ఆధునిక పోకడల్ని అందిపుచ్చుకుంటూ, కొత్త విషయాలు తెలుసుకోవడానికి ప్రయత్నిస్తారు.  నెట్‌వర్క్‌ని ఏర్పరుచుకుంటారు. ఇవన్నీ వారి పరిధినీ, విజయావకాశాలనూ పెంచుతాయి.

అధిగమించి..

విజేతలెప్పుడూ తమ లక్ష్య సాధనకు ఎవరో వచ్చి తమని ప్రోత్సహించాలని ఎదురుచూడరు. మనసు చెప్పిందే వింటారు. తమలోని నైపుణ్యాలు, సామర్థ్యాలను తాము గుర్తించగలుగుతారు. అనుకున్నదాన్ని సాధించగలమో లేదో నిర్ణయించుకోగలుగుతారు. అదే వారిలో ఆత్మవిశ్వాసాన్ని నింపి ధైర్యంగా ముందడుగు వేసేలా చేస్తుంది. అంతేకాదు,  అలా సాధించిన పురోగతికి తృప్తి పడి అక్కడే ఆగిపోరు. మరో అడుగేయడానికి సిద్ధపడతారు. కొత్త పాఠాలు నేర్చుకుంటూ పాత తప్పులను సరిదిద్దుకుంటూ ముందుకు సాగుతారు.  

సమన్వయం..

ఇంటి పనులకీ, ఆఫీసు బాధ్యతలకీ మధ్య స్పష్టమైన గీత ఏర్పరుచుకుంటారు విజేతలు. ఎక్కడ ఒత్తిడిని అక్కడే వదిలిపెడతారు. పనుల బాధ్యత తీసుకోవడం, దానికి సంబంధించిన మంచి చెడులను సమానంగా స్వీకరించడం చేస్తుంటారు. సమన్వయం చేసుకొంటూ ప్రతి చోట తమ ప్రత్యేకతను చాటుతారు. వీటితోపాటు శారీరక, మానసికారోగ్యాన్ని పరిరక్షించుకుంటూ వృత్తిగత విజయాలకు దారులు వేసుకుంటారు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని