ఖర్చు లెక్క తేలాలంటే..

ఇల్లు, ఆఫీసు బాధ్యతలను చక్కగా నిర్వర్తిస్తాం. ఇంట్లో వాళ్లకు ఏమేం కావాలో దగ్గరుండి చూసుకుంటాం. అన్నీ ఎంత క్రమపద్ధతిగా చేసినా.. ఖాతా మాత్రం ఎలా ఖాళీ అవుతోందో తెలియట్లేదు. చాలామంది ఉద్యోగినులు ఎదుర్కొనే పరిస్థితే కదూ! అయితే ఈ నియమాలు పాటించండి.

Published : 19 Nov 2023 02:17 IST

ఇల్లు, ఆఫీసు బాధ్యతలను చక్కగా నిర్వర్తిస్తాం. ఇంట్లో వాళ్లకు ఏమేం కావాలో దగ్గరుండి చూసుకుంటాం. అన్నీ ఎంత క్రమపద్ధతిగా చేసినా.. ఖాతా మాత్రం ఎలా ఖాళీ అవుతోందో తెలియట్లేదు. చాలామంది ఉద్యోగినులు ఎదుర్కొనే పరిస్థితే కదూ! అయితే ఈ నియమాలు పాటించండి.

పుస్తకంలో రాయండి..

బడ్జెట్‌ని మూడు రకాలుగా విభజించుకోండి. నిత్యావసర సరకులు, మందులు, గ్యాస్‌, కరెంటు బిల్లులు, వంటి వాటిని అత్యవసర జాబితాగా రాసుకోండి. ఈ నెల లేకపోయినా పర్లేదు అనిపించిన వాటిని మరో జాబితాగా రాసి పెట్టుకోండి. వేటికి ఎంత ఖర్చవుతుందో అంచనా వేసుకొని ఉంచుకోండి. తర్వాత పొదుపునకు ఎంత కేటాయించుకోవాలో కూడా నిర్ణయించుకోండి. అత్యవసర అవసరాలు, పొదుపు.. రెండూ పూర్తయ్యాకే మిగిలినవి  అనుకుంటే సరి. ఈ తీరు ఖర్చు అదుపులో ఉంచడమే కాదు.. ప్రాధామ్యాలను నిర్ణయించుకోవడాన్నీ అలవాటు చేస్తుంది. అయితే ఖర్చు పెట్టిన ప్రతి రూపాయి లెక్కా ఆ పుస్తకంలో చేర్చడం మాత్రం మరవొద్దు.

వృథా ఖర్చు వద్దు.. సరకులు, దుస్తుల కోసం పెద్ద షాపులు, మాల్స్‌కి వెళుతున్నారా? ఒకటి కొనాలని వెళ్తుంటాం. ఆఫర్లు, రాయితీలు ఆకర్షించేస్తాయి. తక్కువకు వస్తున్నాయని అవసరం లేకపోయినా కొంటాం. అదేమో మన బడ్జెట్‌పై ప్రభావం చూపుతుంది. కొనేముందే నిజంగా అవసరమా అని చెక్‌ చేసుకోండి. చాలా అవసరం అనిపిస్తేనే కొనండి. లేదంటే ఎంత తక్కువ అయినా పక్కన పెట్టేయాల్సిందే. అప్పుడే ఖర్చు కట్టడి అవుతుంది.

ప్రణాళికగా.. పిల్లల పుట్టినరోజులు, పండగలంటూ అనుకోని ఖర్చులొస్తుంటాయి. బడ్జెట్‌లో వీటికీ ముందస్తు ప్రణాళిక ఉండాలి. లేదంటే తర్వాత మనమే ఇబ్బంది పడతాం. నెలలో ప్రత్యేక దినాలు వగైరా ఉంటే ముందుగానే మార్క్‌ చేసుకోవాలి. వాటికీ ఎంత ఖర్చు అవుతుందనేది అంచనా వేసుకోవాలి. దాని ప్రకారం ఆ నెల ఖర్చులను ప్లాన్‌ చేసుకోవాలి. అప్పుడూ భారమనిపించదు. ఇలా నెలపాటు ప్రణాళికతో సాగండి. తర్వాతి నెలల్లో అవసరమైతే మార్పులు చేసుకోండి. ఖర్చు ఆనుపానులు తెలియడమే కాదు.. ఆర్థిక క్రమశిక్షణా అలవడుతుంది.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని