తిరుగుబాటు విఫలమైంది... కానీ!

ప్రపంచ చరిత్రలో ఎన్నో తిరుగుబాట్లు. అన్నీ సఫలమయ్యాయా? విఫలమై కాలగర్భంలో కలిసిపోయినవే ఎక్కువ. 1975లో ఫ్రాన్స్‌లో సెక్స్‌ వర్కర్లు చేసిన తిరుగుబాటు కూడా అలాంటిదే అనుకున్నారు చరిత్రకారులు.

Published : 02 Jun 2024 01:51 IST

ప్రపంచ చరిత్రలో ఎన్నో తిరుగుబాట్లు. అన్నీ సఫలమయ్యాయా? విఫలమై కాలగర్భంలో కలిసిపోయినవే ఎక్కువ. 1975లో ఫ్రాన్స్‌లో సెక్స్‌ వర్కర్లు చేసిన తిరుగుబాటు కూడా అలాంటిదే అనుకున్నారు చరిత్రకారులు. ఆ తిరుగుబాటు విఫలమయ్యిందే కానీ వాళ్లిచ్చిన స్ఫూర్తి మాత్రం ఇప్పటికీ ప్రపంచదేశాల్లో పడుపువృత్తిలో ఉన్న ఎంతోమంది ఆడవాళ్లకు ఊపిరినిస్తూనే ఉంది..
1975లో జూన్‌ 2న ఫ్రాన్స్‌లోని ప్రముఖ చర్చిలని అక్కడి వేశ్యలు ఆక్రమించుకున్నారు. ఒకరోజు, రెండు కాదు... ఎనిమిది రోజులు ‘మేం నరకానికి పోతామన్నారు... ఇప్పుడు మీతో కలిసి మీ డైనింగ్‌ టేబుల్‌ మీద భోజనం చేయడానికి సిద్ధంగా ఉన్నాం’ అంటూ విప్లవ గీతాన్ని ఆలపించారు. ఇలా వేశ్యలంతా ఒక్కటై తిరుగుబాటు చేయడానికి కారణం ఫ్రాన్స్‌ నగరంలో వాళ్లపై జరిగిన దాడులే. వాళ్లని బానిసలుగా చూడటం, నగరంలో ఎక్కడ నేరం జరిగినా దాన్ని వేశ్యలపై నెట్టడం, జైళ్లకు పంపడం, అకారణంగా చంపడం వంటివన్నీ వారి ఆగ్రహానికి కారణమయ్యాయి. ఫలితమే ఈ తిరుగుబాటు. విచారం ఏంటంటే... వాళ్ల తిరుగుబాటుని అక్కడి ప్రభుత్వం పూర్తిగా అణచివేసింది. వాళ్ల డిమాండ్లలో ఒక్కదాన్నీ ప్రభుత్వం పట్టించుకోలేదు. అలా 49 ఏళ్ల క్రితం సెక్స్‌వర్కర్ల తిరుగుబాటు విఫలమైనా... ప్రపంచవ్యాప్తంగా పడుపువృత్తిలో ఉండి హక్కుల్ని కోల్పోయిన అనేక మందికి ఈ ఉద్యమం స్ఫూర్తినిస్తూనే ఉంది. వాళ్లు తిరుగుబాటు చేసిన ఈ రోజుని ప్రపంచవ్యాప్తంగా సెక్స్‌ వర్కర్స్‌ డేగా జరుపుకొంటున్నారు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్