సహజీవనం చేసింది... భరణం ఇవ్వాలా?

అమ్మానాన్నలకి మేం ముగ్గురం. ఉద్యోగాలు చేస్తున్నాం. అక్కకి సంబంధాలు వచ్చినా నచ్చక పెళ్లి ఆలస్యమవుతోంది. దీంతో అన్నయ్య మాకెవరికీ తెలియకుండా ప్రేమించిన అమ్మాయితో సహజీవనం చేస్తున్నాడు. వాళ్ల ఫ్యామిలీ మా కాలనీలోనే ఉంటుంది. కానీ, వీళ్లేమో ఉద్యోగ రీత్యా బెంగళూరులో ఉంటున్నారు. ఇటీవల వారిమధ్య ఏం గొడవ జరిగిందో తెలియదు కానీ, ఆ అమ్మాయి ఆత్మహత్యాయత్నం చేసింది.

Updated : 04 Jun 2024 12:36 IST

అమ్మానాన్నలకి మేం ముగ్గురం. ఉద్యోగాలు చేస్తున్నాం. అక్కకి సంబంధాలు వచ్చినా నచ్చక పెళ్లి ఆలస్యమవుతోంది. దీంతో అన్నయ్య మాకెవరికీ తెలియకుండా ప్రేమించిన అమ్మాయితో సహజీవనం చేస్తున్నాడు. వాళ్ల ఫ్యామిలీ మా కాలనీలోనే ఉంటుంది. కానీ, వీళ్లేమో ఉద్యోగ రీత్యా బెంగళూరులో ఉంటున్నారు. ఇటీవల వారిమధ్య ఏం గొడవ జరిగిందో తెలియదు కానీ, ఆ అమ్మాయి ఆత్మహత్యాయత్నం చేసింది. అందుకు మా అన్నతో పాటూ మేమంతా కారణమే అంటూ మాపై కేసు పెట్టింది. పైగా తమకి పెళ్లయ్యిందనీ, విడాకులతో పాటు భరణమూ ఇప్పించమని కోరుతోంది. నాన్న ఇంకా ఆస్తులు పంచలేదు. ఆయనకి బాధ్యత ఉంటుందా? 

- ఓ సోదరి

హజీవనం అనేది హిందూ ధర్మ శాస్త్రంలో లేదు. పెళ్లికాకుండానే భార్యాభర్తల్లా కలిసి ఒక ఇంట్లో జీవించడాన్ని భారతీయ సంస్కృతిలో ఒకప్పుడు నేరంగా భావించేవారు. కానీ, 2006లో లతాసింగ్‌ వర్సెస్‌ యూపీ రాష్ట్రప్రభుత్వానికి జరిగిన కేసులో ఇద్దరు మేజర్లు కలిసి జీవించాలనుకోవడం నేరం కాదని కోర్టు నిర్ధారించింది.అలాగని పెళ్లయ్యాక విడాకులు తీసుకోకుండా ఇంకో స్త్రీతో సంబంధం పెట్టుకుని ఆమెతో కలిసి జీవించడం నేరం. ఇది భారతీయ న్యాయ సంహిత(ఐపీసీ)లోని సెక్షన్‌ 494 కింద చట్టవ్యతిరేకంగా రెండో వివాహం (బైగామీ) చేసుకోవడమే అవుతుంది. మీ విషయానికి వస్తే... మీ అన్నయ్యతో జీవించిన అమ్మాయి తమకు పెళ్లయ్యిందని చెప్పినా... అందుకు ఆధారాలు చూపించగలగాలి. ముఖ్యంగా హిందూ సంప్రదాయ పద్ధతుల్లో అంటే కన్యాదానం, హోమం, సప్తపది... వంటి ఘట్టాలతో సాగితేనే దాన్ని చట్టప్రకారం పెళ్లిగా పరిగణిస్తారు. అలాకాకుండా ఏ గుళ్లోనో, దేవుడి ముందో తాళి కడితే అది పెళ్లి కాదు. ఇక, ఆ యువతి ఆత్మహత్యాయత్నం చేయడానికి కారణాలేంటి? మీ మీద మోపిన అభియోగాలకు నిర్ధారణ ఏంటి? ఇవన్నీ తనిచ్చిన ఫిర్యాదులోనే చూడాలి. మీ నాన్న ఆస్తి... స్వార్జితం అయితే, దాన్ని ఆయన తనకు నచ్చినవారికి ఇవ్వొచ్చు. భాగం అడిగే హక్కు ఆమెకు లేదు. మీరు ముందు ఏ పోలీస్‌ స్టేషన్‌లో కేసు పెట్టిందో అక్కడి నుంచి కాగితాలు తెప్పించుకుని పరిశీలించండి. మీ మీద క్రిమినల్‌ కేసు లేకుండా చూసుకోండి. హైకోర్టులో క్వాష్‌ పిటిషన్‌ వేసి ఎఫ్‌ఐఆర్‌ మీద యాక్షన్‌ తీసుకోకుండా ప్రయత్నించండి. అయితే, భారతీయ నాగరిక్‌ సురక్షిత సంహిత(సీఆర్‌పీసీ)లోని సెక్షన్‌ 125(1) ప్రకారం సహజీవనం చేసినవారు కూడా మెయింటెనెన్స్‌ అడగవచ్చని కోర్టు తీర్పులు చెబుతున్నాయి. భయపడకుండా నిర్ణయం తీసుకోండి. 

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్