ఒత్తిడిని గుర్తించారా?

ఇంటిపని, కుటుంబ బాధ్యతలు, చదువు...ఇలా మనకు తెలియకుండానే కొన్నిసార్లు ఒత్తిడి బారిన పడుతుంటాం. అయితే, దాన్ని గుర్తించలేకపోవడం, దీర్ఘకాలం ఈ పరిస్థితి కొనసాగడంతో కుంగుబాటు బారిన పడాల్సి వస్తుందట.

Published : 17 Jun 2024 01:31 IST

ఇంటిపని, కుటుంబ బాధ్యతలు, చదువు...ఇలా మనకు తెలియకుండానే కొన్నిసార్లు ఒత్తిడి బారిన పడుతుంటాం. అయితే, దాన్ని గుర్తించలేకపోవడం, దీర్ఘకాలం ఈ పరిస్థితి కొనసాగడంతో కుంగుబాటు బారిన పడాల్సి వస్తుందట. అంతేకాదు, ఇది అనేక అనారోగ్య సమస్యలకూ కారణమవుతుందనీ, మహిళలే ప్రధానంగా బాధితులనీ చెబుతున్నాయి నివేదికలు. మరి దాన్నెలా గుర్తించాలో తెలుసుకుందామా!

ఇంటిల్లిపాది అవసరాలూ తీర్చాలి. ఆఫీసులో బాధ్యతలూ నిర్వర్తించాలి. రెండిటినీ సమన్వయం చేసుకునే క్రమంలో ఏ మాత్రం తడబడినా ఒత్తిడి తప్పకపోవచ్చు. దీంతో నిస్సత్తువ, అసహనం.... ఆవరిస్తాయి. ఏకాగ్రత ఉండదు. చిన్నచిన్న విషయాలూ గుర్తుండవు. ఇది మనసునే కాదు...క్రమంగా శరీరాన్నీ ప్రభావితం చేస్తుంది. దాంతో ఒళ్లునొప్పులూ, తలనొప్పి లాంటివి సర్వసాధారణంగా మారతాయి. ఇవన్నీ మీలో తరచూ చూస్తుంటే ఒత్తిడి బారిన పడుతున్నట్లే గుర్తించాలి. త్వరితగతిన బయటపడేందుకు మంచి ఆహారం తీసుకోవాలి, ధ్యానం చేయాలి.

  • ఏడెనిమిది గంటలు నిద్రపోయాక కూడా ఇంకా అలసటగా అనిపిస్తుందా! దీనికి బద్ధకమనే పేరు పెట్టేయకండి. ఒత్తిడీ కారణమే కావొచ్చు. ఏ పనీ చేయాలనిపించకపోవడం, సమయానికి నిద్రపోకపోవడం, కలత నిద్ర వంటివన్నీ స్ట్రెస్‌కి సూచనలే. ఈ ఇబ్బందిని దాటేయాలంటే కనీసం ఎనిమిది గంటలైనా గాఢంగా నిద్రించాలి. పడుకునే ముందు డిజిటల్‌ తెరలకు దూరంగా ఉండాలి. అప్పుడే త్వరితగతిన బయటపడగలరు.
  • లైంగికవాంఛలు తగ్గడం కూడా ఒత్తిడికి సంకేతమే. మెదడులో గజిబిజి ఆలోచనలు, స్పష్టత లేని నిర్ణయాలు... వంటివి మీ మనసుకి ఆందోళన కలిగిస్తాయి. దీంతో శరీరమూ మీ మాట వినదు. మనసు ఎంత ప్రశాంతంగా ఉంటే అంత సంతోషంగా ఉండొచ్చు. ఇందుకు పరిష్కారంగా తగిన వ్యాయామం చేయండి. హ్యాపీ హార్మోన్లు ఒత్తిడిని అదుపు చేస్తాయి.
  • అతిగా ఉద్వేగానికి లోనవుతున్నారా?చిన్నచిన్న సందర్భాలకే ఏడవడం, పిల్లల వల్ల చిన్న తప్పు ఎదురైనా కోపగించుకోవడం, కొట్టడం, చీటికీమాటికీ అరవడం.. లాంటి సమస్యలు కనిపిస్తుంటే.. ఒత్తిడికి గురవుతున్నారేమో గమనించుకోవాలి. బయటపడటానికి వ్యాపకాలను అలవరుచుకోవాలి. కొత్త భాష, సాంకేతికత వంటివి నేర్చుకోండి. మీ భావాలను ఇతరులతో పంచుకోండి. అలా ఇష్టం లేకపోతే మారుపేరుతో బ్లాగ్‌లు రాయండి. సామాజిక మాధ్యమాల్లో మీ అభిప్రాయాలను వెలిబుచ్చండి. ఇవన్నీ మీ ఒంటరితనాన్నీ, ఒత్తిడినీ పోగొట్టేవే!
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్