కారులో... షికారుకెళ్తే...

ప్రయాణాలంటే చాలామందికి ఇష్టమే కదా! అందులోనూ లాంగ్‌డ్రైవ్‌లు మనలో మరింత హుషారు నింపుతాయి. ప్రకృతిని ఆస్వాదించాలంటే ఏదో ఒక అందమైన ప్రదేశానికే వెళ్లాలా? మన జర్నీనే ఓ అందమైన అనుభూతిలానూ మార్చుకోవచ్చు.

Published : 20 Jun 2024 05:18 IST

ప్రయాణాలంటే చాలామందికి ఇష్టమే కదా! అందులోనూ లాంగ్‌డ్రైవ్‌లు మనలో మరింత హుషారు నింపుతాయి. ప్రకృతిని ఆస్వాదించాలంటే ఏదో ఒక అందమైన ప్రదేశానికే వెళ్లాలా? మన జర్నీనే ఓ అందమైన అనుభూతిలానూ మార్చుకోవచ్చు. అందులో ముఖ్యమైన భాగం... కిటికీలోంచి చూస్తూ ప్రకృతిని ఆస్వాదించడం. మనసుకు నచ్చే పాటలు వింటూ అలా కిటికీలోంచి బయటకు చూస్తుంటే, పుష్పక విమానమెక్కి స్వర్గానికి వెళ్తున్నామా? అనిపిస్తుంది. ఎన్ని మైళ్లు ప్రయాణించామో కూడా తెలియదు. కిటికీలోంచి బయటకు చూడడం... వినడానికి సింపుల్‌గా అనిపించొచ్చు. కానీ, నిద్రావస్థలో ఉన్న మన ఇంద్రియాలను తట్టిలేపి అంతులేని ఉత్సాహాన్నిస్తుంది. మనసుకీ ప్రశాంతతని అందిస్తుంది. దారిలో కనిపించే కొండలూ, నదులూ, చెట్లూ అన్నీ అలా మన కళ్లముందు మెరుపువేగంతో వెళ్లిపోతుంటాయి. పక్కనున్న మనుషులు, భవనాలన్నీ రకరకాల రంగులూ, ఆకారాల్లో మసకమసకగా కనిపిస్తూ వెనక్కి పరుగెడతాయి. ప్రయాణిస్తున్నంత సేపూ కారు ఇంజిన్‌ చప్పుడు, ఏసీ నుంచి వచ్చే ఒకలాంటి సన్నని, మృదువైన శబ్దం, మన పక్కన వెళ్లే ఇతర వాహనాల మోత... ఇవన్నీ ఒక రిథమ్‌లానూ అనిపిస్తాయి. అంతేకాదు, మన మనసులో ఉన్న ఒత్తిళ్లను పోగొట్టుకునే మంచి సమయం కూడా ఇదే. మెదడులోకి వచ్చే రకరకాల ఆలోచనలూ కారు చక్రాల కింద పడి వెళ్లిపోతుంటాయి. మధ్యమధ్యలో వచ్చే ప్రతిమలుపూ ఓ కొత్త స్నాప్‌షాట్‌లా ఉంటుందనుకోండి. అలా ప్రకృతిని చూస్తూ ఆనందిస్తూ వెళ్తున్న ఆ కాసేపూ స్వేచ్ఛా లోకంలో పయనిస్తున్నట్లే ఉంటుంది. ఇక మన ఊహలకైతే అంతే ఉండదు. ఆ కాస్త సమయంలోనే మన జీవితాన్ని కథలు కథలుగా అల్లేసుకోవచ్చు కూడా. ఈ ఆనందాన్ని మీరూ పొందాలనుకుంటున్నారా? అయితే, కారులో షికారుకు పయనమవ్వండి మరి!

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్