మరో పెళ్లి చేసుకున్నాక నువ్వే కావాలంటున్నాడు!

నా వయసు 25ఏళ్లు. పదహారేళ్లప్పుడే పెళ్లి చేశారు. రెండేళ్లకు అతడి వేధింపులు తట్టుకోలేక పారిపోయి వచ్చేశా. పెద్దలతో మాట్లాడినా ఫలితం లేదని వదిలేశాం.

Published : 09 Jul 2024 18:35 IST

నా వయసు 25ఏళ్లు. పదహారేళ్లప్పుడే పెళ్లి చేశారు. రెండేళ్లకు అతడి వేధింపులు తట్టుకోలేక పారిపోయి వచ్చేశా. పెద్దలతో మాట్లాడినా ఫలితం లేదని వదిలేశాం. అప్పటి నుంచి మా మధ్య రాకపోకలూ, ఎటువంటి మాటలూ లేవు. దాంతో గతేడాది మరో వ్యక్తితో ఇంట్లో వాళ్లు పెళ్లి చేశారు. ఈ మధ్య అతడు వచ్చి అసలు నీ పెళ్లి చెల్లదు... తనతో వచ్చేయమంటున్నాడు. ఇప్పుడు నేనేం చేసి ఈ పెళ్లిని చట్టబద్ధం చేసుకోవాలి? 

శ్రావణి, అనంతపురం

మీరు చేసుకున్న రెండో పెళ్లి చట్టవిరుద్ధం అంటోన్న అతడికి, పద్దెనిమిదేళ్లు నిండకుండానే మిమ్మల్ని చేసుకున్న వివాహమూ చెల్లదని తెలిసి ఉండాలి. చట్టాల మీద అవగాహన లేకపోతే ఎన్ని సమస్యలు వస్తాయన్నదానికి మీ పరిస్థితే ఉదాహరణ. మీకు పదహారేళ్లప్పుడు పెళ్లి చేశారంటున్నారు. తరవాత కోర్టు ద్వారా విడాకులు తీసుకోకుండానే మరో వివాహం చేసుకున్నారు. బాల్య వివాహ నిరోధక చట్టం ప్రకారం ఆడపిల్లలకు 18ఏళ్ల లోపు పెళ్లి చేసినప్పుడు ఆ అమ్మాయి తను ఆ వైవాహిక జీవితాన్ని కొనసాగించాలనుకుంటే తప్ప దానికి విలువ ఉండదు. లేదంటే పెళ్లైన ఏడాదిలోపు కోర్టులో నల్లిటీ కింద కేసు వేస్తే కోర్టు ఆ మ్యారేజీని రద్దు చేస్తుంది. మీరు ఇప్పటికైనా నా మొదటి పెళ్లి చెల్లదని కేసు వేయండి. లేదంటే సెక్షన్‌ 13 కింద నన్ను హింసిస్తున్నాడు కాబట్టి విడాకులు ఇప్పించమని అడగండి. మీరే నిర్ణయం తీసుకున్నా...కోర్టుకి వెళ్లకపోతే సమస్య పరిష్కారం కాదు. అలానే నా వ్యక్తిగత జీవితాన్ని పాడుచేస్తున్నాడనీ చెబుతూ, మీ ప్రైవసీకి భంగం కలిగించొద్దని కోరుతూ ఓ ఇన్‌జంక్షన్‌ ఆర్డర్‌ తీసుకోండి. ఆ విడాకులు అయ్యాక ఇప్పుడు మీరు చేసుకున్న వివాహాన్ని రిజిస్టర్‌ చేయించుకోండి. అప్పుడే దానికి చట్టబద్ధత ఉంటుంది.


మీరైతే ఏం చేస్తారు?

న రెండు కళ్లలో ఏది ఎక్కువ ఇష్టమంటే సమాధానం ఏం చెబుతాం? కడుపున పుట్టినవాళ్లూ అంతే! ఇద్దరిలో ఎవరిపై ఎక్కువ ప్రేమంటే ఏ అమ్మయినా సమాధానం చెప్పలేదు. కానీ కొందరు తెలిసో తెలియకో... సందర్భాన్ని బట్టో కొన్నిసార్లు ఒకవైపు మొగ్గు చూపుతుంటారు. దాంతో ‘అమ్మకి నేనెప్పుడూ నచ్చను’, ‘చిన్న కొడుకు/ కూతురుపైనే తల్లికి ప్రేమెక్కువ’ వంటి కామెంట్లకు దారితీస్తాయి. అక్కడితో ఆగితే సరే... కానీ ఒక్కసారి పిల్లల మనసుల్లోకి ఆ ఆలోచన చేరితే ఏం చేసినా పోదు. ఆ భావన వాళ్లలోకి రాకుండా మీరెలా జాగ్రత్తలు తీసుకున్నారో, తీసుకుంటున్నారో మాతో పంచుకోండి. మీ పేరు, ఊరు వివరాలనూ జోడించండి. వసుంధరలో ప్రచురిస్తాం.
ఈ-మెయిల్‌- vasundhara@eenadu.in (గమనిక: సమాధానాలు మహిళలు మాత్రమే పంపగలరు)

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్