కాలి పగుళ్లకు చెక్‌

కాళ్లకు పగుళ్లుంటే అవి ఇతర ఆరోగ్య సమస్యలకూ దారితీయచ్చు. అందుకే...

Updated : 16 Jun 2021 12:37 IST

కాళ్లకు పగుళ్లుంటే అవి ఇతర ఆరోగ్య సమస్యలకూ దారితీయచ్చు. అందుకే...

రాత్రి పడుకునేముందు పాదాల పగుళ్లకు వెన్న లేదా వ్యాజిలిన్‌ రాస్తే మృదువుగా అవుతాయి. పక్కబట్టలకు అంటకుండా సాక్స్‌ లేదా పాత దుప్పటి వేసుకోవచ్చు.* నానబెట్టి పొట్టు తీసిన బాదంపప్పు క్రమం తప్పక తింటే కాళ్లు పగలవు.
* కాళ్లను కొంచెం నాననిచ్చి స్క్రబ్బర్‌ లేదా ప్యూమైన్‌ స్టోన్‌తో రుద్దాలి. తరచూ ఇలా చేస్తే పగుళ్లు పోతాయి.
* తేనె మంచి యాంటీసెప్టిక్‌. తేనెలో నిమ్మరసం కలిపి పాదాలకు రాయడం వల్ల ఫలితం ఉంటుంది.
* రాత్రి కొబ్బరినూనెను రాసి ఉదయం రుద్ది కడగాలి. ఇందులో ఉండే యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, యాంటీమైక్రోబియల్‌ గుణాలు పగుళ్లను తగ్గిస్తాయి. ఆలివ్‌, నువ్వుల నూనెలు కూడా సత్ఫలితాలను ఇస్తాయి.
* పగిలిన పాదాలకు అరటిపండు గుజ్జు రాయాలి. ఇందులో ఉండే ఎ, బి6, సి విటమిన్లు చర్మాన్ని మృదువుగా చేస్తాయి.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్