బాహుబలికి... కాగితం కళ!  

‘బాహుబలి’ సినిమాలో ఒకేసారి మూడు బాణాలు ఎక్కుపెట్టే అనుష్కని చూశారా? ఓ చాలాసార్లు చూశాం అంటారా. అయితే క్విల్లింగ్‌తో చేసిన అనుష్క, ప్రభాస్‌లని చూశారా? చూడకపోతే ఇక్కడ చూడండి. భలే ఉన్నాయి కదూ! కాగితాలని ఇలా చూడచక్కని కళాఖండాలుగా మల్చడంలో సురేఖది ప్రత్యేకమైన శైలి....

Updated : 12 Aug 2021 04:34 IST

‘బాహుబలి’ సినిమాలో ఒకేసారి మూడు బాణాలు ఎక్కుపెట్టే అనుష్కని చూశారా? ఓ చాలాసార్లు చూశాం అంటారా. అయితే క్విల్లింగ్‌తో చేసిన అనుష్క, ప్రభాస్‌లని చూశారా? చూడకపోతే ఇక్కడ చూడండి. భలే ఉన్నాయి కదూ! కాగితాలని ఇలా చూడచక్కని కళాఖండాలుగా మల్చడంలో సురేఖది ప్రత్యేకమైన శైలి.

తూర్పుగోదావరి జిల్లా యు.కొత్తపల్లి మండలం కొండెవరం గ్రామానికి చెందిన జగతా సురేఖ ఎమ్‌ ఫార్మసి చదివి, ఓ ప్రైవేటు కళాశాలలో అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌గా చేస్తున్నారు. ఒకసారి ఎక్కడో చూసి క్విల్లింగ్‌ కళపై ఆసక్తిని పెంచుకున్నారు. సన్నని కాగితాలని చుట్టలుగా చుట్టి చేసే ఈ క్విల్లింగ్‌తోనే త్రీడీ బొమ్మల తయారీ మొదలుపెట్టారు.  భర్త ప్రోత్సాహంతో సొంతంగా సాధన చేసి మన సంస్కృతిని ప్రతిబింబించే బొమ్మలతో రికార్డులు సృష్టించారు. త్వరలో గిన్నిస్‌ రికార్డు చేయాలని అనుకుంటున్నారు. ‘ఈ బొమ్మలు చేయడం కష్టమే అయినా నాకు ఇష్టం. ఒక్కో భాగాన్నీ విడిగా చుట్టి, మళ్లీ అన్నీ కలిపి తీర్చిదిద్దాలంటే చాలా సహనం, ఓర్పు ఉండాలి. ఒక్కో బొమ్మకు రెండు, మూడు రోజులు పడుతుంది. గిన్నిస్‌ రికార్డు సాధించాలనేది నా లక్ష్యం. ఈ కళలో ఆసక్తి వారికి ఆన్‌లైన్‌లో శిక్షణా ఇద్దామనుకుంటున్నా’ అంటున్నారు సురేఖ.

-గంపారాజు, కొత్తపల్లి

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్