లాండ్రీతో ఏటా రూ.మూడుకోట్లు!
ఏదైనా భిన్నంగా చేయాలి... పదిమందికీ ఉపాధిని కల్పించాలి అన్న ఆలోచనలే ఆమెను వ్యాపార దిశగా నడిపించాయి. అవకాశాల్ని సృష్టించుకుంటూ, అవరోధాల్ని అధిగమిస్తూ లాండ్రీ సర్వీసు సేవలతో తనదైన ముద్ర వేశారామె.
ఏదైనా భిన్నంగా చేయాలి... పదిమందికీ ఉపాధిని కల్పించాలి అన్న ఆలోచనలే ఆమెను వ్యాపార దిశగా నడిపించాయి. అవకాశాల్ని సృష్టించుకుంటూ, అవరోధాల్ని అధిగమిస్తూ లాండ్రీ సర్వీసు సేవలతో తనదైన ముద్ర వేశారామె. నిరక్షరాస్య మహిళలకు ఉద్యోగాల్ని కల్పించి వ్యాపారవేత్తగా నిలదొక్కుకున్నారు. ఆవిడే విజయవాడకు చెందిన భీమవరపు పద్మ. తన గురించి వివరించారిలా...
జీవితం ఎవరికీ వడ్డించిన విస్తరి కాదు...మనకేం కావాలో మనమే నిర్ణయించుకోవాలి. ఆ లక్ష్యం కోసం ఎంత కష్టమైనాపడాలి. వ్యాపారంలోకి అడుగుపెట్టాక ఎన్నో విషయాలను నేర్చుకున్నా. మరెన్నో అవకాశాల్ని దక్కించుకున్నా. మాది విజయవాడ. నాన్న విశ్రాంత ప్రభుత్వ ఉద్యోగి. తన ఉద్యోగరీత్యా హైదరాబాద్‌లో కొన్నాళ్లున్నాం. కోఠి విమెన్స్ కళాశాలలో బీఏ, తిరుపతి ఎస్వీ వర్సిటీ నుంచి సైకాలజీలో పీజీ చేశా. పెళ్లయ్యాక మావారితో కలిసి ఓ కార్పొరేట్ విద్యాసంస్థకు సీసీ కెమెరాలు ఏర్పాటు చేసే కాంట్రాక్టు పొందాం. అది వ్యాపారంలో నా తొలి అడుగు. వైవిధ్యంగా ఇంకేదైనా చేయాలనిపించేది. మార్కెట్లో ప్రజలు, సంస్థల అవసరాలపై అధ్యయనం ప్రారంభించా. తాడిపత్రిలో ‘దోబీ’ యూనిట్ గురించి తెలిసి, చూసొచ్చా. అది నచ్చడంతో 2017లో విజయవాడ కేంద్రంగా ‘సిటీ దోబీస్ ఇండస్ట్రియల్ లాండ్రీ’ సంస్థకి శ్రీకారం చుట్టా. స్టాండప్ ఇండియా పథకం కింద రూ.75 లక్షల రుణం పొంది అయిదు లక్షల రూపాయల సొంత మూలధనంతో ఆ వ్యాపారాన్ని ప్రారంభించా.
ప్రత్యామ్నాయ మార్గాల్లో... మొదట చిన్న చిన్న సంస్థలకు సేవలందిస్తూ క్రమంగా నిలదొక్కుకున్నా. ఆ సమయంలోనే ఆర్టీసీ సూపర్ లగ్జరీ, ఓల్వో, ఇతర ఏసీ బస్సుల బ్లాంకెట్లు, డోర్ కర్టెన్లు, సీట్లకు తొడిగే కవర్లు రోజూ ఉతికి, ఆరబెట్టి ఇచ్చే పనులకు టెండర్లు ఆహ్వానించింది. అతి తక్కువ కోట్ చేయడంతో ఆ టెండర్ దక్కించుకున్నా. అప్పటి నుంచి బస్సులతో పాటు విజయవాడలోని ఆర్టీసీ అతిథిగృహం, డ్రైవర్ల రూమ్‌లకు రోజూ బ్లాంకెట్లను శుభ్రం చేసి అందజేస్తున్నాం. ఐలాండ్, పున్నమి ఘాట్లలోని రిసార్టులకు సేవలు కొనసాగిస్తున్నాం. వీటితోపాటు పర్యాటకం, అపార్టుమెంట్లకు సేవలు అందిస్తున్నా. ఏటా రూ.మూడు కోట్ల వార్షికాదాయాన్ని అందుకుంటున్నా. అంతా బాగుందనుకునే సమయంలో కరోనా ప్రభావం పడింది.
ఆర్టీసీˆ బస్సులు ఆపేసింది. పర్యాటకశాఖ రిసార్ట్సు మూతపడ్డాయి. ఇవన్నీ మా వ్యాపారాన్ని దెబ్బతీశాయి. పని లేదని ఉద్యోగులకు జీతాలు ఆపడం నాకు నచ్చలేదు. అందుకే కొత్త ఆలోచన చేశా. నేరుగా వినియోగదారుల ఇంటి వద్దకే వెళ్లి సేవలందించడం మొదలుపెట్టాం. విజయవాడ, తాడేపల్లి, అమరావతి ప్రాంతాల్లో అపార్టుమెంట్ల నివాసితులు, బ్యాచిలర్ ఉద్యోగులను కలిశాం. వారి దుస్తులు ఉతికి, ల్యాండ్రీ చేసి ఇస్తామని మంత్లీ సర్వీసులను మాట్లాడుకున్నాం. ఇలా అనేక ప్రత్యామ్నాయాలతో తిరిగి వ్యాపారాన్ని నినిలబెట్టుకున్నా. తాడేపల్లిలో సీఎం నివాసం, అమరావతిలో సచివాలయం విధులకు వివిధ ప్రాంతాల నుంచి వచ్చే పోలీసులు ఇతర ప్రభుత్వ ఉద్యోగులు మా దగ్గరే దుస్తులు ఉతికించి పట్టుకెళుతున్నారు. కేవలం అర గంటలోనే ఉతికి, ఆరబెట్టి, ఇస్త్రీ చేసి ఇస్తున్నాం.
అధునాతన యంత్రాలతో... ఈ వ్యాపారాన్ని మొదలుపెట్టినప్పుడు విజయవాడ, తాడేపల్లిలో కొన్ని హోటళ్లకు వెళ్లి సర్వీస్ అందిస్తామని చెబితే మహిళలు చేయగలరో లేదో అని అవకాశం ఇవ్వలేదు. తరువాత వాళ్లే మా సేవలను తెలుసుకుని వెదుక్కుంటూ వచ్చారు. తెలిసిన వారికీ చెప్పి ఎన్నో ఖాతాలను అప్పగించారు. రోజుకు ఏడు వేల జతలు ఉతికి, ఆరబెట్టి, లాండ్రీ చేసే సామర్థ్యం ఉన్న అత్యాధునిక యంత్రాలు ఉన్నాయి. ఒకేసారి 200 జతలు ఉతికి, ఆరబెడతాం. దుస్తులు తీసుకురావడం నుంచి తిరిగి అప్పగించడం వరకూ అంతా శాస్త్రీయంగా, ప్రణాళికాబద్ధంగా చేస్తాం. అందువల్లే ఎక్కడా ఎప్పుడూ పొరపాటు జరగలేదు. ప్రస్తుతం 24 గంటలూ యూనిట్ నడుపుతున్నాం. 18 మందికి ఉపాధి కల్పిస్తున్నా. ఇందులో 14 మంది మహిళలే. వీరిలో చాలామంది నిరక్షరాస్యులు. కూలి తప్ప ఇతరత్రా పనులు చేయలేరు. అందుకే వారిని ఎంచుకుని, ఉపాధి కల్పించా. చదువుకోకపోయినా యంత్రాల నిర్వహణలో ఇచ్చిన శిక్షణను అందిపుచ్చుకుని చక్కగా పని చేస్తారు. మనకు ఇష్టమైన రంగంలో ముందుకు వెళ్లాలంటే రిస్క్ తీసుకోవడానికి సిద్ధపడాలి. నేను లాండ్రీ పెడతా అన్నప్పుడు చాలా మంది నవ్వారు. ఇంకేదైనా చెయ్యొచ్చు కదా అన్నారు. కానీ నాకు నా మీద నమ్మకం ఉంది. అలానే ఇక్కడిదాకా వచ్చా. నాకిద్దరు పిల్లలు. నేను మా పరిశ్రమకు దగ్గర్లోనే ఉంటాను. అందువల్ల ఇల్లు, వ్యాపారం... రెండింటినీ ఏ ఇబ్బందీ లేకుండా చూసుకోగలుగుతున్నా.
కాకర్ల వాసుదేవరావు గుంటూరు
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
బ్యూటీ & ఫ్యాషన్
- హెయిర్ బన్.. స్టైలిష్‌గా వేసేద్దాం!
- సన్‌స్క్రీన్... పౌడర్‌లో!
- వేసవిలో వీటి విషయంలో జాగ్రత్త!
- వ్యాయామం వల్ల మొటిమలు రాకుండా..!
- గడువు దాటితే వద్దు...
ఆరోగ్యమస్తు
- రాగుల్లో దాగున్న ‘ఆరోగ్యం’!
- వేరుశనక్కాయలు తింటే... ధ్యానం చేసినట్లే!
- తేలిగ్గా తీసుకోవద్దు!
- ప్రసవానంతరం పొట్టను ఇలా తగ్గించుకుందాం!
- వ్యాయామం చేయలేకపోతున్నారా?
అనుబంధం
- పోనీ ఇలా చెప్పి చూద్దామా?
- పెళ్లికి ముందు సరేనన్నాడు.. ఇప్పుడు వద్దంటున్నాడు!
- నో చెప్పండిలా!
- అనుమానిస్తున్నాడని నిరూపించేదెలా?
- పిల్లలకీ కావాలో రొటీన్!
యూత్ కార్నర్
- Miss Universe : ఈ ముద్దుగుమ్మదే.. ఆ ఘనత!
- ఆ చక్రాలని నడిపించేది వాళ్లే!
- దాచగలరు..!
- మన గచ్చకాయలాట... కొరియాలో!
- విరాళాలకు వారధిగా.. ఆమె సేవలు!
'స్వీట్' హోం
- వేసవిలో.. ఇల్లు చల్లగా!
- గోవర్ధనాల గుబాళింపు!
- ఇనుప కడాయిలో ఇవొద్దు!
- Green Vegetables : వీటిని ఎలా వండుతున్నారు?
- వాచీ రింగు పూల హంగు!
వర్క్ & లైఫ్
- ఒక్క రోజులోనే.. ఒంటరిగా.. ఆ ప్రాంతాలన్నీ చుట్టేశా!
- ఆ అల్లరి పిల్లే ఇప్పుడు టీచరైంది.. ఈ స్టూడెంట్-టీచర్ కథ చదివారా?!
- ప్రయాణాలకు... చిన్ని సాయాలు!
- ఆర్థికంగా ఎదగాలంటే...
- ఇది మహిళల హోలీ.. మగాళ్లకు నో ఎంట్రీ!