వీధులే బడులయ్యాయి!

ప్రత్యక్ష బోధన లేక దాదాపు ఏడాదిన్నర నుంచి పిల్లలు చదువుకు దూరంగా ఉంటున్నారు. టీశాట్‌, దూరదర్శన్‌ల ద్వారా ప్రభుత్వ పాఠాలను బోధించినా అవి వారికి చేరడం లేదని సజ్జనం భాగ్యలక్ష్మి తెలుసుకున్నారు. పెద్దపల్లి ...

Published : 05 Sep 2021 02:20 IST

ప్రత్యక్ష బోధన లేక దాదాపు ఏడాదిన్నర నుంచి పిల్లలు చదువుకు దూరంగా ఉంటున్నారు. టీశాట్‌, దూరదర్శన్‌ల ద్వారా ప్రభుత్వ పాఠాలను బోధించినా అవి వారికి చేరడం లేదని సజ్జనం భాగ్యలక్ష్మి తెలుసుకున్నారు. పెద్దపల్లి జిల్లా పుట్టపల్లి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు ఆవిడ. కొందరు పిల్లలు పనులకు వెళ్లడమూ గమనించారామె. వీరందరిని మళ్లీ చదువుల వైపు మళ్లించాలని సంకల్పించారు. గ్రామంలోని పలు ఇళ్లు, భవనాల గోడలపై రంగులతో పాఠ్యాంశాలను రాసి పిల్లలతో చదివిస్తున్నారు. తెలుగు, ఆంగ్ల వర్ణమాల, గణిత అంశాలు, పదబంధాలను స్వయంగా రాస్తూ వారితో చదివిస్తున్నారు. సొంత డబ్బులు ఖర్చు పెట్టి సహచర ఉపాధ్యాయుల సాయంతో ఈ అక్షర కత్రువు సాగిస్తున్నారు. గ్రామంలోని పిల్లలందరూ ఒకే చోట చేరి తమ పాఠ్యాంశాలకు అనుగుణంగా ఉత్సాహంగా.. ఉల్లాసంగా వల్లెవేస్తూ నేర్చుకుంటున్నారు. ‘గోడల మీద పాఠాలా? అయినట్టే’ అని నిట్టూర్చిన తల్లితండ్రులే గత 5 నెలల నుంచీ ఈ పంతులమ్మ చేసిన అక్షర యజ్ఞంతో పిల్లల్లో వచ్చిన మార్పును చూసి ఆశ్చర్యపోతున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్