ఆటలతో నేర్పుతూ...

చిన్నారులు ఎక్కువగా ఇష్టపడే ఆన్‌లైన్‌ గేమ్స్‌తోనే వాళ్లలో నైపుణ్యాలనీ, సృజననీ పెంచేలా ఓ ప్రభుత్వ ఉపాధ్యాయురాలు వినూత్నంగా ప్రయత్నించారు. ఆమె రూపొందించిన గేమ్స్‌ 17 దేశాల్లోని చిన్నారులకు చేరువ కావడం విశేషం.

Published : 05 Sep 2021 02:20 IST

చిన్నారులు ఎక్కువగా ఇష్టపడే ఆన్‌లైన్‌ గేమ్స్‌తోనే వాళ్లలో నైపుణ్యాలనీ, సృజననీ పెంచేలా ఓ ప్రభుత్వ ఉపాధ్యాయురాలు వినూత్నంగా ప్రయత్నించారు. ఆమె రూపొందించిన గేమ్స్‌ 17 దేశాల్లోని చిన్నారులకు చేరువ కావడం విశేషం. విజయనగరం జిల్లా బొబ్బిలి పట్టణానికి చెందిన ఉషారాణి పట్టణంలోని గొల్లపల్లి పురపాలక ఎలిమెంటరీ పాఠశాలలో ఉపాధ్యాయురాలు. ఆవిడ స్వయంగా 50 ఆన్‌లైన్‌ గేమ్స్‌ని తయారు చేశారు. ట్రయల్‌ అండ్‌ ఎర్రర్‌, పిక్చర్‌ రీడింగ్‌ వంటి విధానాలు వాడి వీటిని తయారుచేశారు. ఉదాహరణకి ఆమె రూపొందించిన క్రికెట్ గేమ్‌నే తీసుకొంటే ప్రతి విద్యార్థీ క్రీడాకారుడిగా మారి స్కోరును పొందుతాడు. అదే సమయంలో గణితం, భాషలపై పట్టూ సాధిస్తాడు. ఈ గేమ్స్‌ చిన్నారులని బాగా ఆకట్టుకుంటున్నాయి. ఆటల్లోనే బోధన, ఇతర అంశాలు ఉండటంతో అమ్మానాన్నలూ పిల్లల్ని ఈ ఆటలు ఆడేలా ప్రోత్సహిస్తున్నారు. ఉషారాణి భర్త నాగరాజు హైస్కూల్‌ ఉపాధ్యాయుడు. కుమారుడు హేమంత్‌ ఇంటర్‌ రెండో సంవత్సరం చదువుతున్నాడు. అతనూ, అతని స్నేహితులనూ చూసే ఆన్‌లైన్‌ గేమింగ్‌పై ఆసక్తి పెంచుకున్నా అంటారు ఉషారాణి. పదో తరగతి దాకా విద్యార్థులకు ఉపయోగపడేలా ఈ 50 ఆటలను తయారు చేశారామె. వీటికి కోసం ‘ఫ్రీˆ స్మార్ట్‌ క్లాస్‌’ పేరుతో వెబ్‌సైట్నూ రూపొందించి ఉచితంగా నెట్‌లో అందుబాటులో ఉంచారు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్