ప్రియ బోధనకు పురస్కారం

మెకానికల్‌ ఇంజినీరింగ్‌ చేసి.. ప్రభుత్వ పారిశ్రామిక శిక్షణ సంస్థ (ఐటీఐ)లో ఉద్యోగం పొందింది. బోధనలో ప్రత్యేక ఒరవడిని చూపి ఎంతోమంది విద్యార్థులను తీర్చిదిద్దింది. అందుకు గుర్తింపుగా కేంద్ర ప్రభుత్వం నుంచి ప్రతిష్ఠాత్మక కౌశలాచార్య అవార్డు-21 దక్కించుకుంది.

Updated : 29 Sep 2021 02:42 IST

మెకానికల్‌ ఇంజినీరింగ్‌ చేసి.. ప్రభుత్వ పారిశ్రామిక శిక్షణ సంస్థ (ఐటీఐ)లో ఉద్యోగం పొందింది. బోధనలో ప్రత్యేక ఒరవడిని చూపి ఎంతోమంది విద్యార్థులను తీర్చిదిద్దింది. అందుకు గుర్తింపుగా కేంద్ర ప్రభుత్వం నుంచి ప్రతిష్ఠాత్మక కౌశలాచార్య అవార్డు-21 దక్కించుకుంది. ఆమే.. ప్రకాశం జిల్లా ఒంగోలుకు చెందిన ఎండ్లూరి రజితప్రియ.

జిత ప్రియ పుట్టిందీ, పెరిగిందీ ఒంగోలులోనే. బ్రేక్‌ ఇన్‌స్పెక్టర్‌ కావాలని మెకానికల్‌ ఇంజినీరింగ్‌ను ఎంచుకుంది. సంబంధిత పరీక్ష రాసి ఇంటర్వ్యూ వరకూ వెళ్లినా కావాల్సినంత లైసెన్స్‌ పీరియడ్‌ లేకపోవడంతో క్వాలిఫై కాలేదు. దీంతో తనకు ఆసక్తి ఉన్న ఉపాధ్యాయ వృత్తి వైపు వెళ్లింది. ఒప్పంద విధానంలో మూడేళ్లపాటు ఒంగోలులోని ప్రభుత్వ పారిశ్రామిక సంస్థ (ఐటీఐ)లో పనిచేసింది. తర్వాత ఏపీపీఎస్‌సీ ద్వారా ఇదే కళాశాలలో నియమితురాలైంది. తర్వాత నెల్లూరులో చేసి మళ్లీ పదోన్నతిపై ఒంగోలు వచ్చింది. నగరంలోని ప్రభుత్వ బాలుర ఐటీఐలో ఫిట్టర్‌ ట్రేడ్‌ విభాగంలో ఉపశిక్షణ అధికారిగా ఉద్యోగం. ఆమె భర్త వెంకటేశ్వర్లు పంచాయతీరాజ్‌ ఏఈ. రజిత ప్రియ తన తొమ్మిదేళ్ల ఉద్యోగ జీవితంలో దాదాపు 400 మంది విద్యార్థులను ఐటీఐ నిపుణులుగా తీర్చిదిద్దింది. కఠినమైన మెషినరీ బోధనలను సులువైన పద్ధతిలో బోధించడం మొదలుపెట్టింది. దీంతో విద్యార్థులూ ఆసక్తి పెంచుకున్నారు. ఫలితమే పాస్‌ శాతం 95గా ఉండేది. ఈ ఏడాది అది 97కు చేరింది. ఈ కృషికి గుర్తింపే  కౌశలాచార్య అవార్డు. ఇటీవల వర్చువల్‌ కార్యక్రమం ద్వారా దీన్ని ఆమెకు అందజేశారు. దాంతో పాటు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నుంచి అభినందన సందేశాన్నీ అందుకుంది. కేంద్ర నైపుణ్యాభివృద్ధి, వ్యవస్థాపక మంత్రిత్వ శాఖ ఈ అవార్డును అందిస్తుంది. దేశంలోని ఐటీఐ కళాశాల్లో మాస్టర్‌ ట్రైనర్‌, వెల్డర్‌, ఎలక్ట్రానిక్స్‌, మోటర్‌ వెహికిల్‌, ఫిట్టర్‌ తదితర విభాగాల్లో బోధకులకు ఈ పురస్కారాన్నిస్తారు. ఈ ఏడాది దేశవ్యాప్తంగా 11 మంది ఎంపికయ్యారు. ఆంధ్రప్రదేశ్‌లోని దాదాపు 80 ప్రభుత్వ ఐటీఐ కళాశాలల నుంచి రజిత ఒక్కరే ఎంపిక కావడం విశేషం. ‘అవార్డు దక్కడం సంతోషం. ప్రధాని అభినందన అందుకోవడం మరింత ఆనందం. మరింత ఉత్సాహంగా పని చేసి, విద్యార్థుల్లో దాగిన నైపుణ్యాలను మెరుగుపరిచేందుకు కృషి చేస్తా’నంటోంది రజిత ప్రియ.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్