బస్సుల్లో ‘భరోసా’

పట్టణాలు, నగరాల్లో ప్రజా రవాణాను ఉపయోగించుకునే స్త్రీలపై లైంగిక వేధింపులు, ఈవ్‌-టీజింగ్‌లు సాధారణమైపోయాయి. వీటిని అరికట్టడానికి వినూత్న ఆలోచనతో ముందుకు వచ్చారు ఓ ముగ్గురు మహిళలు.

Published : 04 Oct 2021 01:25 IST

ట్టణాలు, నగరాల్లో ప్రజా రవాణాను ఉపయోగించుకునే స్త్రీలపై లైంగిక వేధింపులు, ఈవ్‌-టీజింగ్‌లు సాధారణమైపోయాయి. వీటిని అరికట్టడానికి వినూత్న ఆలోచనతో ముందుకు వచ్చారు ఓ ముగ్గురు మహిళలు. లైంగిక వేధింపులకు వ్యతిరేకంగా ఆవాజ్‌-ఈ-తెలంగాణలో భాగంగా ‘బస్సుల్లో భరోసా’ అనే ఆన్‌లైన్‌ ప్రచారం ప్రారంభించారు. బడ్డింగ్‌ ఛైల్డ్‌ రైట్స్‌ కార్యకర్త హిమబిందు. ఆమె తన స్నేహితురాళ్లు కౌముది నాగరాజు, నిఖిత, మైసూర్‌కు చెందిన జైనాలతో కలిసి దీన్ని మొదలుపెట్టారు. వివిధ వర్గాలతో బృందచర్చలు, సమావేశాలు, సందేశాలు, పోస్టర్ల ఏర్పాటు వంటి వివిధ పద్ధతుల్లో ఈ దుస్థితికి అడ్డుకట్ట వేస్తున్నారు. ‘పబ్లిక్‌ ట్రాన్స్‌పోర్టులో ప్రయాణించేటప్పుడు అనేకసార్లు మేమూ వేధింపులు ఎదుర్కొన్నాం. వీటిని ఎలా ఎదుర్కోవాలో అమ్మాయిలకు చెబితే... నేరస్థుల ఆగడాలకు చెక్‌ పెట్టొచ్చు. ఫలితంగా మహిళల్లో మనోబలం పెరుగుతుంది’ అని చెబుతున్నారు వీరు. అంతేకాకుండా రాచకొండ పోలీస్‌ కమిషనర్‌ మహేష్‌ భగవత్‌ని కలిసి తమ కార్యక్రమాల్లో పోలీసుల సహకారాన్నీ కోరారు. ఇక ముందు పోలీసులు, షీ బృందాలు వీరికి సాయం అందించనున్నాయి. అలానే పబ్లిక్‌ అనౌన్స్‌మెంట్‌ సిస్టమ్స్‌ను ఇన్‌స్టాల్‌ చేయడానికీ, ప్రభుత్వ బస్సుల్లో లామినేటెడ్‌ పోస్టర్లను పెట్టడానికి ఛేంజ్‌.ఓఆర్‌జీ ద్వారా ఓ పిటిషన్‌ వేశారు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్