రెడ్‌క్రాస్‌కు తొలి అధ్యక్షురాలు
close
Updated : 27/11/2021 05:59 IST

రెడ్‌క్రాస్‌కు తొలి అధ్యక్షురాలు

రెడ్‌ క్రాస్‌ సంస్థ పేరు వినని వాళ్లు ఉండరు. అలాంటి సంస్థకు అంతర్జాతీయ అధ్యక్షురాలిగా స్విస్‌ దౌత్యవేత్త మిర్జానా స్పొల్జారిక్‌ ఎగ్గర్‌ బాధ్యతలు చేపట్టనున్నారు. దాదాపు 160 ఏళ్ల ఘనచరిత్ర ఈ సంస్థది. 100కుపైగా దేశాల్లో విస్తరించి ఉంది. 20,000 పైచిలుకు  శాశ్వత వలంటీర్లున్నారు. అలాంటి ఈ సంస్థ అధ్యక్ష పదవిలోకి ఒక మహిళ రావడం ఇదే ప్రథమం. ఫిలాసఫీ, ఎకనామిక్స్‌, ఇంటర్నేషనల్‌ లాల్లో మాస్టర్స్‌ చేసిన మిర్జానా ప్రస్తుతం యునైటెడ్‌ నేషన్స్‌ డెవలప్‌మెంట్‌ ప్రోగ్రామ్‌ (యూఎన్‌డీపీ)కి అసిస్టెంట్‌ సెక్రటరీ జనరల్‌, అసిస్టెంట్‌ అడ్మినిస్ట్రేటర్‌. యూరప్‌, కామన్వెల్త్‌ ఆఫ్‌ ఇండిపెండెంట్‌ స్టేట్స్‌కు యూఎన్‌డీపీ రీజినల్‌ బ్యూరోకూ నాయకత్వం వహిస్తున్నారు. గతంలో బెర్న్‌లోని విదేశాంగ మంత్రిత్వ శాఖలో ఐక్యరాజ్యసమితి, అంతర్జాతీయ సంస్థల విభాగానికి అధిపతిగా పనిచేశారు. అక్కడ స్విస్‌ యూఎన్‌ విధానాలు, ప్రాధాన్యాల రూపకల్పనలో ప్రధాన పాత్ర పోషించారు. ‘లింగ సమానత్వాన్ని సాధించాలంటే మహిళలు మాత్రమే కాదు అందరి పూర్తి, చురుకైన భాగస్వామ్యంతోనే సాధ్యం. రాజకీయ, ఆర్థిక వ్యవస్థల్లో మహిళల భాగస్వామ్యం, నాయకత్వం సమగ్ర సామాజిక, ఆర్థికాభివృద్ధిలో చాలా అవసరం’ అని చెప్పే ఈవిడ రెడ్‌క్రాస్‌ను మరింత గొప్ప సంస్థగా తీర్చిదిద్దుతారని విశ్వసిస్తున్నారు.


Advertisement

మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

మరిన్ని

ఆరోగ్యమస్తు

మరిన్ని

అనుబంధం

మరిన్ని

యూత్‌ కార్నర్

మరిన్ని

మంచిమాట


'స్వీట్' హోం

మరిన్ని

వర్క్‌ & లైఫ్

మరిన్ని