51 వేల పాముల్ని కాపాడింది!
పాము కనిపిస్తే వణికిపోతాం. లేదా చంపేస్తుంటాం. వనిత ఆ రెండూ చేయదు.. ప్రేమగా వాటిని దగ్గరకు తీసుకుంటుంది. తన 51 వేల పాముల్ని కాపాడింది!ఊళ్లోనే కాదు, చుట్టుపక్కల గ్రామాల్లో ఎక్కడైనా ఇళ్లలోకి పాము వచ్చిందంటే
పాము కనిపిస్తే వణికిపోతాం. లేదా చంపేస్తుంటాం. వనిత ఆ రెండూ చేయదు.. ప్రేమగా వాటిని దగ్గరకు తీసుకుంటుంది. తన 51 వేల పాముల్ని కాపాడింది!ఊళ్లోనే కాదు, చుట్టుపక్కల గ్రామాల్లో ఎక్కడైనా ఇళ్లలోకి పాము వచ్చిందంటే ఆమెకే కబురొస్తుంది. వెంటనే వెళ్లి, దాన్ని పట్టుకొని సురక్షిత ప్రాంతంలో వదిలిపెడుతుంది. ఇలా 51వేల పాములను రక్షించిన వనిత గిన్నిస్ రికార్డుతోపాటు, కేంద్ర ప్రభుత్వ ‘నారీశక్తి’ పురస్కారాన్నీ అందుకుంది. తను పాముల కోసం ఎందుకు ఇంతలా కష్టపడుతోందంటే...
బడి నుంచి ఇంటికి రాగానే పొలంలో ఉన్న నాన్న దగ్గరకు వెళ్లేది వనిత. అక్కడ ఏదైనా పాము కనిపిస్తే అందరూ పారిపోయేవారు కానీ, వనిత వాళ్ల నాన్న మాత్రం దాన్ని సునాయాసంగా పట్టుకొని దగ్గర్లోని అడవిలో వదిలేసేవాడు. ఎందుకలా అన్న వనితకు ఆయన పాములు, వివిధ జీవుల వల్ల కలిగే ప్రయోజనాలను చెబుతూ ఉండేవాడు. ఆయన చెప్పే విషయాలకు చాలా ప్రభావితురాలైంది వనిత. 12వ ఏట నుంచి ఆయన దగ్గర పాములను పట్టడంలో మెలకువల్నీ నేర్చుకుంది. ఎక్కడ పాము కనిపించినా పట్టుకుని అడవుల్లో వదిలేది. తోటి పిల్లలకూ అవగాహన కల్పించేది.
భర్త ప్రోత్సాహంతో...
మహారాష్ట్రలోని బుల్దానా ప్రాంతం వనిత బొరాడే వాళ్లది. మధ్యతరగతి వ్యవసాయ కుటుంబం. డిగ్రీ చేశాక, బ్యాంకు ఉద్యోగి భాస్కర్‌తో వివాహమైంది. అప్పటికే సొంతూరితోపాటు ఆ చుట్టుపక్కల ఎక్కడ పాము కనిపించినా వనితకే కబురు రావడం, వెంటనే అక్కడకు చేరుకొని ఆ పామును పట్టుకుని అడవిలోకో పెద్ద కాలువల్లోకో వదిలేయడం నిత్యకృత్యం. ఊరి వాళ్లంతా ఆమెను ప్రేమగా నాగిని, నాగరాణి, పాములక్క, నాగమోహిని అని పిలుస్తారు. పెళ్లయ్యాక భర్తా ప్రోత్సహించాడు.
అన్నీ విషపూరితం కాదు...
‘మన దేశంలో కనిపించే వాటిలో నాలుగైదు రకాలు మాత్రమే విషపూరితం. మిగతావన్నీ విషం లేనివే. ఇది తెలియక చాలామంది పాము కనిపించగానే చంపేస్తారు. ఇలా చేస్తుంటే మొత్తానికి ఈ జాతే అంతరించిపోతుంది. వీటిని సంరక్షిస్తే, వ్యవసాయానికి చాలా లాభం ఉంది. ముఖ్యంగా పంటకు నష్టం కలిగించే ఎలుకలు వంటి వాటిని పాము చంపుతుంది. అందుకే ఈ విషయంలో అందరిలో అవగాహన తేవాలనిపించింది. మొదట మా ఇంటి నుంచే ప్రారంభించా. మా పిల్లలకు పామును పట్టుకోవడం, దాంతో ఆడుకోవడం వంటివి నేర్పించా. వాళ్లిద్దరికీ ఇప్పుడు పామంటే భయం లేదు. దాన్ని చూసి చుట్టుపక్కల పిల్లలకూ పాముల గురించి అవగాహన కలిగింది. 30 ఏళ్లగా పాముల సంరక్షణలో ఉన్నా. చాలా మంది ఇంట్లో లేదా పొలంలో పాము ఉందని ఫోన్ చేస్తారు. ఏ సమయంలోనైనా వెంటనే అక్కడకు చేరుకుంటా. దాన్ని పట్టుకొని లక్షణాలేంటో గమనిస్తాను. దాని వివరాలను నమోదు చేసుకుంటాను. అప్పుడు దాన్ని సురక్షిత ప్రాంతంలో వదిలేస్తా. ఇప్పటివరకు 51 వేల పాములను పట్టుకోగలిగా. దీనికి గిన్నిస్ రికార్డులో చోటు దక్కించుకున్నా. కాలేజీలు, పాఠశాలలకు వెళ్లి విద్యార్థులకు పాముల పరిరక్షణపై అవగాహనా తరగతులు తీసుకుంటా. ‘సోయ్రే వంచరే మల్టీపర్పస్ ఫౌండేషన్’ స్థాపించి సేవలందిస్తున్నా. పాము కాటుకు గురైతే ఏం చేయాలి, చికిత్స ఎలా తీసుకోవాలో కూడా నేర్పిస్తున్నా. ఇవి సాధారణంగా వెలుగు ఎక్కువగా లేని ప్రాంతాల్లో నివసిస్తాయి. వీటిని పూజించే సంప్రదాయం మనది. దాన్నే కొనసాగిద్దాం. వాటిని కాపాడదాం’ అంటోన్న 47ఏళ్ల వనితను ఇటీవల కేంద్ర ప్రభుత్వం నారీశక్తి పురస్కారంతో సత్కరించింది. తాను పాముల్ని పట్టినపుడు వీలుంటే వీడియోనీ తీయిస్తుంది. వాటిని యూట్యూబ్ ఛానెల్లో (సర్పమిత్ర వనిత బొరాడే)లో పెడుతుంది. తన ఛానల్‌ను పాతిక లక్షల మంది వీక్షించారు. ఈమె చిత్రంతో మహారాష్ట్ర తపాలా శాఖ ప్రత్యేక స్టాంపును విడుదల చేసి గౌరవించడం విశేషం.
స్త్రీ అంటే ఒక అద్భుతం. సౌందర్యానికీ సృజనాత్మకతకూ ప్రతిరూపం. మహిళలు ఏ స్థాయిలో ఉన్నారన్నది ముఖ్యం కాదు. ఎవరికి వారే అపురూపం.
- అలీషియా కీస్, అమెరికన్ గాయని
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
బ్యూటీ & ఫ్యాషన్
- వేసవిలో ట్యాన్ సమస్య తగ్గాలంటే..!
- అడ్డిగ... అందాల నగ!
- ఇలా చేస్తే.. అందం తగ్గదు..!
- నాకు ఏ క్రీమ్?
- స్ట్రెచ్ మార్క్స్.. తగ్గట్లేదా..?
ఆరోగ్యమస్తు
- అందుకే వీటిని ఇలా తీసుకోవాలట..!
- వసంతంలో ఆరోగ్య జాగ్రత్తలు..!
- ప్రెగ్నెన్సీ.. ఈ జాగ్రత్తలు పాటిస్తున్నారా?
- ఉత్తేజంగా మారాలంటే..!
- రక్తహీనత తగ్గించే బీట్రూట్!
అనుబంధం
- ఒక మెట్టు దిగితే చాలు...
- ఆ అమ్మాయితో ఆ చాటింగ్.. ఆయన్ని నమ్మలేకపోతున్నా..!
- అలా చదివితే మేలే...
- చిన్నవే... చక్కదిద్దుతాయి!
- యుక్త వయసు నుంచీ...!
యూత్ కార్నర్
- అప్పుడు ఫ్యాన్... ఇప్పుడందరి ఫేవరెట్!
- భూగోళాన్ని చుట్టేస్తానంటోంది!
- దాంతో మాట్లాడుతుంటే మతి పోయిందనేవాళ్లు!
- ఎరీ... ఆ ఊరి పట్టు..!
- అందరికీ నచ్చేవి.. నాకు నచ్చవు.. ఎందుకిలా?
'స్వీట్' హోం
- పుల్లటి పెరుగుతో.. పెరిగే రుచి!
- రిస్క్ లేకుండా దాచేద్దాం!
- వేసవిలో ఇల్లు చల్లగా...
- కళ్లు తిరిగే కార్పెట్లు...
- ఆ చోటు గుర్తిస్తే చాలు...
వర్క్ & లైఫ్
- మీకు ‘ట్రావెలింగ్’ అంటే ఇష్టమా..?
- పనికి ‘బ్రేక్’ వేయండి!
- ఇవి టైంపాస్ కోసమే కాదు.. సంపాదనకూ..!
- మారాలని గట్టిగా అనుకోండి!
- Samantha: చిన్న చిట్కాలతోనే 45 కిలోల బరువు తగ్గా..!