నా కోసం అమ్మ ఎన్నో అవమానాలు భరించింది...
ఆమె శరీరంలో విరగని ఎముకంటూ లేదు. 20 ఏళ్లుగా మంచానికే పరిమితమైనా.. ఆమె చదువులో సరస్వతి. కదిలే చేతులతోనే 3డీ విజువలైజేషన్లో పట్టు సాధించి కన్సల్టెంట్‌గా పని చేస్తోంది. మన కోసమే కాదు, ఇతర ప్రాణుల కోసం కూడా జీవించేదే అసలైన జీవితం అని చెప్పే 34 ఏళ్ల ఆస్తా మౌర్య నుంచి ప్రతి ఒక్కరూ నేర్చుకోవాల్సినదెంతో ఉంది..
ఆమె శరీరంలో విరగని ఎముకంటూ లేదు. 20 ఏళ్లుగా మంచానికే పరిమితమైనా.. ఆమె చదువులో సరస్వతి. కదిలే చేతులతోనే 3డీ విజువలైజేషన్లో పట్టు సాధించి కన్సల్టెంట్‌గా పని చేస్తోంది. మన కోసమే కాదు, ఇతర ప్రాణుల కోసం కూడా జీవించేదే అసలైన జీవితం అని చెప్పే 34 ఏళ్ల ఆస్తా మౌర్య నుంచి ప్రతి ఒక్కరూ నేర్చుకోవాల్సినదెంతో ఉంది..
అందరిలాగే ఆరోగ్యంగా పుట్టింది ఆస్తా. రెండేళ్ల వయసులో ఓ రోజు అకస్మాత్తుగా తొడ ఎముక విరిగింది. అప్పుడే ఆమెకు జన్యుపరమైన వ్యాధి ఉన్నట్లు గుర్తించారు వైద్యులు. నిత్యం ఆమె శరీరంలో ఎముకలు విరిగిపోయే ప్రమాదం ఉందని హెచ్చరించారు. మూడేళ్లప్పుడు, అలాగే అయిదేళ్లప్పుడు.. అలా శరీరంలో ఏదో ఒక ఎముక విరుగుతూనే ఉంది. చికిత్సలు జరుగుతూనే ఉన్నాయి. తల్లి ఉపాధ్యాయురాలు, తండ్రి హోమియోపతి వైద్యుడు. కుటుంబ ఆదాయం అంతంత మాత్రం. అది ఆస్తా వైద్యానికి కూడా సరిపోయేది కాదు. హైస్కూల్‌కి వచ్చేసరికి మంచానికి పరిమితమైపోయింది. చదువుకోవాలనే ఆస్తా ఆసక్తికి ఆ తల్లిదండ్రులు ప్రోత్సాహాన్నిచ్చారు. ఇబ్బందులెన్నెదురైనా తనకు కనీసం చదువునైనా అందించాలనుకున్నారు. వారణాసి, తిల్ భందేశ్వర్లోని నివాసంలో తన గదిలోనే ఉంటూ.. ఆస్తా ఇందిరాగాంధీ ఓపెన్ యూనివర్శిటీలో డిగ్రీ పూర్తి చేసింది.
కల నెరవేరకపోయినా...
చిన్నప్పటినుంచి నాన్నని చూసి నాకూ డాక్టర్ కావాలని ఉండేదంటుంది ఆస్తా. ‘అయితే నా అనారోగ్యం ముందుకు అడుగు వేయనివ్వలేదు. కనీసం హోమియోపతిలోనైనా డిగ్రీ చేద్దామనుకున్నా. లేదంటే బయో టెక్నాలజీ కోర్సులో చేరాలనుకున్నా. 2009లో ప్రవేశపరీక్ష కూడా పాసయ్యా. తీరా చేరాలనుకున్నప్పుడు నా అనారోగ్యాన్ని అభ్యంతరంగా చెప్పారు. నా కల నెరవేరలేదు. అయితేనేం.. గ్రాఫిక్ డిజైనింగ్, 3డీ విజువలైజేషన్లో ప్రత్యేక కోర్సు పూర్తిచేశా. ఇక్కడ కూడా నేనెన్నో ఇబ్బందులెదుర్కొన్నా. వారణాసిలో మొదట ఓ ఇన్స్టిట్యూట్ ప్రవేశం లేదంటే, ఇంటికి దగ్గర్లో ఉన్న మరో సెంటర్లో సీటు దక్కింది. దీంతోపాటు యూట్యూబ్‌లో ఇంటీరియర్, ఎక్స్టీరియర్ డిజైనింగ్‌ను నేర్చుకున్నా. రోజూ సెంటర్‌కు అమ్మ లేదా తమ్ముడు నన్ను జాగ్రత్తగా తీసుకెళ్లేవారు. అమ్మ నన్ను ఇప్పటికీ గాజు బొమ్మలా కాపాడుతోంది. నా కోసం ఎన్నో కష్టాలనెదిరించి పోరాడింది. ఎక్కడకెళ్లినా బంధువులు, తెలిసినవాళ్లు ఆమె చేతి నుంచి ఏదీ తీసుకునేవారు కాదు. నాలాంటి కూతురు పుడుతుందనే అపోహ, మూఢనమ్మకంతో అమ్మను శుభకార్యాలకు పిలిచేవారు కాదు. అన్నింటినీ నా కోసం ఆమె తట్టుకుంది. కోర్సు పూర్తి చేసిన తర్వాత ఇంటి నుంచే డిజైన్స్ చేయడం మొదలుపెట్టా. మొదట వినియోగదారులు నన్ను చూసి నమ్మకం లేదనేవారు. క్రమేపీ నేను చేయగలనని నిరూపించా. వారణాశిలో ఏఎం కన్స్ట్రక్షన్స్కు ఫ్లోర్ ప్లాన్స్‌ను 3డీ డిజైన్‌లో చేసిపెట్టా. పలాటియల్ హౌస్, నాలుగంతస్తుల అపార్ట్‌మెంట్‌కు చేసిచ్చా. ప్రస్తుతం ఒక కమర్షియల్ కాంప్లెక్స్‌కు డిజైన్స్ చేస్తున్నా. ఇలా కన్సల్టెంట్‌గా పనిచేస్తూ, ఇంటికీ ఆర్థికంగా చేయూతనందిస్తున్నందుకు సంతోషంగా ఉంది’ అని అంటోందీ ధీశాలి ఆస్తా.
ఎన్జీవో ప్రారంభించి..
బాల్యం నుంచి కుక్కలు, ఆవులు వంటి జంతువులంటే ఆస్తాకు ఇష్టం. వీటి పరిరక్షణపై అందరికీ అవగాహన కలిగించేలా ‘ఆస్తా లవింగ్ కైండ్‌నెస్ అండ్ కంపేషన్’ (ఏఎల్కేసీ) ఎన్జీవోను స్థాపించింది. జంతు హక్కుల ఉద్యమకారులకు నిధులు సమకూర్చడానికి కృషి చేస్తోంది. దేశవ్యాప్తంగా వారణాశి సహా పుణె, ముంబయి, దిల్లీ, సహరాన్‌పుర్ ప్రాంతాల్లో జరిగే ప్రచార కార్యక్రమాల్లో ఆన్లైన్లో తనవంతు భాగస్వామ్యం వహిస్తోంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
బ్యూటీ & ఫ్యాషన్
- వేసవిలో ట్యాన్ సమస్య తగ్గాలంటే..!
- ఇలా చేస్తే.. అందం తగ్గదు..!
- నాకు ఏ క్రీమ్?
- స్ట్రెచ్ మార్క్స్.. తగ్గట్లేదా..?
- గోటితోనే పోదు మరి!
ఆరోగ్యమస్తు
- అందుకే వీటిని ఇలా తీసుకోవాలట..!
- ప్రెగ్నెన్సీ.. ఈ జాగ్రత్తలు పాటిస్తున్నారా?
- ఉత్తేజంగా మారాలంటే..!
- రక్తహీనత తగ్గించే బీట్రూట్!
- మీ స్కోరెంత?
అనుబంధం
- ఆ అమ్మాయితో ఆ చాటింగ్.. ఆయన్ని నమ్మలేకపోతున్నా..!
- అలా చదివితే మేలే...
- చిన్నవే... చక్కదిద్దుతాయి!
- యుక్త వయసు నుంచీ...!
- పాప వల్ల నాతో ఆ సంతోషం ఉండట్లేదంటున్నారు..!
యూత్ కార్నర్
- భూగోళాన్ని చుట్టేస్తానంటోంది!
- దాంతో మాట్లాడుతుంటే మతి పోయిందనేవాళ్లు!
- ఎరీ... ఆ ఊరి పట్టు..!
- అందరికీ నచ్చేవి.. నాకు నచ్చవు.. ఎందుకిలా?
- తెల్లజుట్టు... కారణమేంటి?
'స్వీట్' హోం
- పుల్లటి పెరుగుతో.. పెరిగే రుచి!
- కళ్లు తిరిగే కార్పెట్లు...
- ఆ చోటు గుర్తిస్తే చాలు...
- చిన్నారుల చిత్రకళా ప్రదర్శన..!
- అద్దమూ మెరవాలిగా..!
వర్క్ & లైఫ్
- మీకు ‘ట్రావెలింగ్’ అంటే ఇష్టమా..?
- ఇవి టైంపాస్ కోసమే కాదు.. సంపాదనకూ..!
- మారాలని గట్టిగా అనుకోండి!
- Samantha: చిన్న చిట్కాలతోనే 45 కిలోల బరువు తగ్గా..!
- ఆఫీసులో ఇలా చేస్తున్నారా?