విరామం తర్వాత...

గర్భం కారణంగా నిత్య ఉద్యోగానికి రెండేళ్లు దూరంగా ఉంది. తిరిగి జాబ్‌ వెతకడం మొదలు పెట్టింది. ఇలాంటప్పుడు ఆన్‌లైన్‌ ద్వారా ఎన్నో అవకాశాలను అంది పుచ్చుకోవచ్చు అంటున్నారు కెరియర్‌

Updated : 02 Apr 2022 05:05 IST

గర్భం కారణంగా నిత్య ఉద్యోగానికి రెండేళ్లు దూరంగా ఉంది. తిరిగి జాబ్‌ వెతకడం మొదలు పెట్టింది. ఇలాంటప్పుడు ఆన్‌లైన్‌ ద్వారా ఎన్నో అవకాశాలను అంది పుచ్చుకోవచ్చు అంటున్నారు కెరియర్‌ నిపుణులు...

సైట్స్‌లో... జాబ్‌ సెర్చ్‌ సైట్స్‌లో బెస్ట్‌ ఓవరాల్‌, జిప్‌ రిక్రూటర్‌, లింక్‌డిన్‌, గ్లాస్‌డోర్‌, ఏంజిల్‌ లిస్ట్‌ వంటివెన్నో సైట్స్‌ ఉన్నాయి. వీటిలో కొత్తగా చేరేవారికి, అనుభవం ఉన్నవారికి లేదా విరామం తర్వాత తిరిగి ఉద్యోగవేటలో ఉన్నవారందరికీ కావాల్సిన సమాచారం దొరుకుతుంది. కొన్ని సైట్స్‌ ఏయే సంస్థలు ఎంతెంత జీతాలను అందిస్తాయో, అలాగే అనుభవజ్ఞుల సూచనలను అందించి చేయూతనిస్తాయి. కొన్ని మాత్రం కొత్తగా ఉద్యోగవేటలో ఉన్నవారి కోసం మాత్రమే పని చేస్తాయి. సంస్థల వివరాలు, కావాల్సిన అర్హత, జీతం వంటివన్నీ పొందుపరుస్తాయి. ఇంకొన్ని విదేశీ సంస్థల్లో అవకాశాలపై అవగాహన కలిగించడమే కాకుండా, చేరాలనుకునేవారికి మార్గాన్ని సూచిస్తాయి.

ప్రస్తుత పరిస్థితి.. ఉద్యోగ విరామం తీసుకొని తిరిగి అడుగు పెట్టాలనుకున్న వారు ప్రస్తుత పరిస్థితిపై అవగాహన తెచ్చుకోవాలి. గతంలో పని చేసిన సంస్థ విధివిధానాల్లో ఏమైనా మార్పులు చోటు చేసుకున్నాయా లేదా ఆ సంస్థ సైట్‌లోకి వెళ్లి గుర్తించాలి. అలాగే అర్హత కూడా మారిందేమో చూడాలి. లేదా అదనపు అనుభవం, కోర్సు అవసరమవుతుందేమో తెలుసుకోవాలి. దానికి తగినట్లుగా ప్రస్తుతం ఆన్‌లైన్‌లో కోర్సులు పూర్తి చేయవచ్చు. అలా కొత్త అర్హతతో అదే కార్యాలయంలోకి అడుగుపెట్టొచ్చు. వేరే చోట కూడా ప్రయత్నించొచ్చు.

అనుభవం.. పూర్వ ఉద్యోగ అనుభవాన్ని దృష్టిలో ఉంచుకోవాలి. అక్కడి అనుభవాలు, సవాళ్లు, బాధ్యతలు వంటివన్నీ ప్రస్తుత ఉద్యోగంలో వినియోగించుకోగలగాలి. చేదు అనుభవాలనూ మరవకూడదు. తిరిగి అదే తప్పు చేయకుండా ఆచితూచి అడుగేస్తే ముందుకు సాగడం సాధ్యమే.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్