అమ్మ అవసరం తెలుసుకుని.. వ్యాపారంలో అడుగుపెట్టి!

భారత్‌లాంటి దేశాల్లో పిల్లలకు సంబంధించిన మార్కెట్‌ చాలా పెద్దది. వారి ఆరోగ్యం, దుస్తులూ, ఆటపాటలూ, చదువులూ... ప్రతి దాంట్లోనూ ఈతరం తల్లిదండ్రులు నాణ్యతకి ప్రాధాన్యం ఇస్తున్నారు. అలాంటి అమ్మలే వీరు కూడా. అంతేకాదు తమ అనుభవాన్నే వ్యాపారంగా మార్చి అక్కడా రాణిస్తున్నారు.

Published : 04 Aug 2022 18:19 IST

భారత్‌లాంటి దేశాల్లో పిల్లలకు సంబంధించిన మార్కెట్‌ చాలా పెద్దది. వారి ఆరోగ్యం, దుస్తులూ, ఆటపాటలూ, చదువులూ... ప్రతి దాంట్లోనూ ఈతరం తల్లిదండ్రులు నాణ్యతకి ప్రాధాన్యం ఇస్తున్నారు. అలాంటి అమ్మలే వీరు కూడా. అంతేకాదు తమ అనుభవాన్నే వ్యాపారంగా మార్చి అక్కడా రాణిస్తున్నారు.

ల్లిదండ్రులైన సందర్భంలో ఎంత ఆనంద పడుతుందో పిల్లల కోసం ఏం వస్తువులు కొనాలో తెలియక అంతే గందరగోళ పడుతోంది ఈతరం. ఇలాంటి అనుభవాన్నే ఎదుర్కొన్నారీ అమ్మలు. ఆపైన ఈ సమస్యకు ‘ద నెస్టరీ’తో తమదైన పరిష్కారం చూపారు. కాబోయే తల్లులకు మూడో త్రైమాసికం మొదలు, పిల్లలకు పన్నెండేళ్లు వచ్చేంత వరకూ వారి ఆరోగ్యానికీ, ఆటలకీ, మానసిక వికాసానికీ అవసరమైన ఉత్పత్తులు ఉండే వెబ్‌ పోర్టల్‌ ఇది. వివిధ బ్రాండ్‌ల ఉత్పత్తుల్ని తల్లులూ, పిల్లల అవసరాలకు తగ్గట్టు ఎంపికచేసి పోర్టల్‌లో ఉంచుతారు. పిల్లలకు ఏం కొనాలన్న విషయంలో తల్లిదండ్రులకు పెద్దగా శ్రమ లేకుండా వాళ్ల వయసు, అవసరాలు చెబితే సరిపోయే వస్తువులు కనిపిస్తాయి. ఈ సంస్థని వైష్ణవి రంగరాజన్‌ మొదలుపెట్టగా.. ఆమెకు అపర్ణ వాసుదేవన్‌ తోడయ్యారు. ‘2015లో తల్లినయ్యా. ఆ సమయంలో ఫేస్‌బుక్‌, వాట్సాప్‌లలో తల్లులకున్న గ్రూపుల్లో చేరి బిడ్డలకు కావాల్సిన వస్తువుల గురించి తెలుసుకున్నా. క్లాత్‌ డైపర్లు, కొత్తగా వచ్చే ఆట వస్తువులూ, పిల్లల వస్తువులు అందించే కంపెనీలూ.. అన్నీ తెలిసేవి. అక్కడే అపర్ణ పరిచయం. మా మాటల మధ్య వచ్చిందే ఈ వెబ్‌సైట్‌ ఆలోచన’ అంటారు వైష్ణవి. ఆట వస్తువులు, పుస్తకాలు, అలంకరణ వస్తువులు, బహుమతుల్లాంటివి 450 కంపెనీలకు చెందిన 30 వేల రకాలు ఈ సైట్‌లో అందుబాటులో ఉంటాయి. దీంట్లో ఏటా రూ.16 కోట్ల విలువైన అమ్మకాలు జరుగుతున్నాయి. గతంలో డెలాయిట్‌ కన్సల్టింగ్‌లో పనిచేసేది వైష్ణవి. తల్లిగా మారాక ఎదురైన అనుభవంతో వ్యాపారంలో అడుగుపెట్టాలనుకుంది. చాలామంది తల్లిదండ్రులతో మాట్లాడి వాళ్ల అవసరాలు, షాపింగ్‌ అనుభవాలు తెలుసుకుని 2019లో 5 బ్రాండ్లు, 25 ఉత్పత్తులతో పోర్టల్‌ మొదలుపెట్టారు. వ్యాపారంలో నిలదొక్కుకుంటున్న సమయంలో కొవిడ్‌ రాకతో ఆర్డర్లు తీసుకోవడం, పంపించడం కష్టమైంది. ఆ సమయాన్ని మరిన్ని మంచి బ్రాండ్లు, సరైన ఉత్పత్తుల ఎంపిక పరిశోధనకు ఉపయోగించారు. ఆ సమయంలోనే వైష్ణవి భర్త విశ్వనాథన్‌ కూడా కంపెనీలో చేరాడు.

‘నేటితరం తల్లిదండ్రులు ఆటల్ని కేవలం సరదాగా చూడటంలేదు, వాటి వెనక పిల్లల సృజనాత్మకత, ఆలోచనా శక్తి పెరిగేలా ఉండాలను కుంటున్నారు. ప్రచారం అవసరంలేని బ్రాండ్లని ఎక్కువగా ఎంచుకుంటాం. తల్లిదండ్రుల జర్నీలో నమ్మకమైన తోడుగా ఉండాలనుకుంటున్నాం’ అని చెప్పే వైష్ణవి.. గతేడాది ‘సికోయా క్యాపిటల్‌’ స్పార్క్‌ ఫెలోషిప్‌కీ ఎంపికైంది.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్