ఆ వీరుల త్యాగాలు వృథా పోకూడదని...
ఆమె భర్త దేశం కోసం ప్రాణాలర్పించారు. కానీ తన కుటుంబంలో దేశభక్తినీ నింపారు. ఆ స్ఫూర్తితో సేవే జీవితంగా మార్చుకున్నారు సుభాషిణీ వసంత్. అమర సైనికుల కుటుంబాలకు చేయూత అందించడమే జీవితాశయంగా
ఆమె భర్త దేశం కోసం ప్రాణాలర్పించారు. కానీ తన కుటుంబంలో దేశభక్తినీ నింపారు. ఆ స్ఫూర్తితో సేవే జీవితంగా మార్చుకున్నారు సుభాషిణీ వసంత్. అమర సైనికుల కుటుంబాలకు చేయూత అందించడమే జీవితాశయంగా మార్చుకున్నారు. భర్తను కోల్పోయి, ఒంటరిగా పిల్లలతో దయనీయ స్థితిలో ఉన్న సైనిక వితంతువులకు నేనున్నానంటూ భరోసా ఇస్తున్నారు.
సుభాషిణి భర్త కల్నల్ వసంత్ వేణుగోపాల్ సైన్యంలో కమాండింగ్ ఆఫీసర్. 2007, ఏప్రిల్‌లో ఇద్దరూ కలిసి బెల్గాంలో ఓ వేడుకకు వెళ్లారు. అక్కడ సైనిక అమరవీరుల కుటుంబాలను కలిశారు. వారిలో భర్తను కోల్పోయి, ఇద్దరు చంటిబిడ్డలతో కనీస అవసరాలు కూడా కరవైన ఒక యువతి దీనస్థితిని చూసి సుభాషిణి హృదయం ద్రవించి పోయింది. ఆ తర్వాతా ఆమె చూపులు తనను వెంటాడుతూనే ఉండేవి. అలాంటి వారికి ఏం చేయగలనా అని ఆలోచించే వారావిడ. కానీ తనూ అలాంటి విషాదాన్ని ఎదుర్కోవాల్సి వస్తుందని ఆవిడ ఊహించలేదు. బెల్గాం నుంచి వచ్చాక మూడు నెలలకు కశ్మీరులో శత్రువులతో పోరాటంలో కల్నల్ వసంత్ ప్రాణాలొదిలారు. ప్రపంచం నలుమూలల నుంచీ సుభాషిణికి సంతాప సందేశాలొచ్చాయి. అమరవీరుడైన కల్నల్ వసంత్‌కు ప్రకటించిన ‘అశోక్చక్ర’ను సుభాషిణి అందుకున్నారు. తన పట్ల ఎవరు సానుభూతి చూపినా, పలకరిస్తున్నా... బెల్గాంలో చూసిన ఒంటరి మహిళ మనసులో మెదులుతుండేది. దేశవ్యాప్తంగా ఆమెలాంటి వారెందరో దుర్భరస్థితిలో, అనామకంగా బతుకుతున్నారు. వారికి భరోసా ఇవ్వడానికి 2007 అక్టోబరులో ‘వసంతరత్న ఫౌండేషన్ ఫర్ ఆర్ట్స్’ స్థాపించారు సుభాషిణి. ఆ కుటుంబాల త్యాగాలను ప్రపంచానికి తెలియజెప్పడం, ఆర్థికంగా చేయూత, వారి పిల్లలకు విద్యతోపాటు ఆ సైనిక వితంతువులకు సాధికారత కల్పించడానికి నడుం కట్టారు.
‘‘దేశవ్యాప్తంగా అమరవీరుల కుటుంబాలను గుర్తించి, వారికి ప్రభుత్వ సౌకర్యాలను అందేలా కృషి చేయాలనుకున్నా. ఇది చాలా ఖర్చుతో కూడిన వ్యవహారం. నేను భరతనాట్య కళాకారిణిని. నా నృత్య ప్రదర్శనల ద్వారా వచ్చే సొమ్మును మా ఫౌండేషన్‌కు కేటాయిస్తున్నా. ముందుగా నాలాంటి అమరవీరుల భార్యల జీవితాలను ప్రతిబింబించేలా ‘సైలెంట్ ఫ్రంట్’ నాటకాన్ని రూపొందించా. దీన్ని పలు నగరాల్లో ప్రదర్శించా. అలా వచ్చిన సొమ్ముతో పని ప్రారంభించా. అప్పటి నుంచి ప్రదర్శనలిస్తున్నా. ప్రభుత్వానికి, అమరవీరుల కుటుంబాలకు మా ఫౌండేషన్ వారధిలా పని చేస్తోంది. ముందు కర్ణాటకలోని మారుమూల ప్రాంతాల్లో అమరవీరుల కుటుంబాలను గుర్తించాం. వారికి ప్రభుత్వపరంగా దక్కాల్సిన సౌకర్యాల కోసం చట్టపరమైన సాయాన్ని అందిస్తున్నాం. అవసరమైన వారికి కౌన్సెలింగ్ ఇస్తున్నాం. ఆ వీరుల పిల్లలకు పాఠశాలలు, కళాశాలల్లో అడ్మిషన్ దొరికేలా చేస్తున్నాం. ఉపకార వేతనాలు ఇస్తున్నాం. అమరవీరుల భార్యలకు వృత్తివిద్యల్లో శిక్షణ ఇప్పిస్తున్నాం. వారి కుటుంబాల్లో చదువుకున్న మహిళలకు, యువతకు ఉద్యోగావకాశాల్ని కల్పిస్తున్నాం. ఇప్పటివరకూ వందల కుటుంబాలకు మాత్రం సాయం చేయగలుగుతున్నాం. దేశవ్యాప్తంగా అమరవీరుల కుటుంబాలకు సేవలందించేలా విస్తరించడం మా ఆశయం’’ అంటున్నారు సుభాషిణి. ఆవిడ కృషికి గుర్తింపుగా ఎన్నో పురస్కారాలూ లభించాయి. వాటి ద్వారా అందిన మొత్తాల్నీ సేవకే వెచ్చిస్తున్న సుభాషిణి దేశభక్తికి ప్రతిరూపంలా లేరూ.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
బ్యూటీ & ఫ్యాషన్
- అమ్మో.. లిప్‌స్టిక్!
- ఫ్రిల్స్లో... బుట్టబొమ్మ!
- వార్థక్యపు ఛాయలు లేకుండా..!
- హెయిర్ బన్.. స్టైలిష్‌గా వేసేద్దాం!
- సన్‌స్క్రీన్... పౌడర్‌లో!
ఆరోగ్యమస్తు
- ఇలా చేస్తున్నారా..!
- గుడ్డుకి బదులుగా..!
- నడకతో ఆల్జీమర్స్ పసిగట్టొచ్చు...!
- నిద్ర లేకపోయినా.. నీరసించిపోకుండా!
- రాగుల్లో దాగున్న ‘ఆరోగ్యం’!
అనుబంధం
- అతను తగినవాడేనా?
- అనుమానంతో.. నా ఫోన్ హ్యాక్ చేశాడా?
- పోనీ ఇలా చెప్పి చూద్దామా?
- పెళ్లికి ముందు సరేనన్నాడు.. ఇప్పుడు వద్దంటున్నాడు!
- నో చెప్పండిలా!
యూత్ కార్నర్
- ఆమె తిట్లకు ఏడ్చేశా..!
- Miss Universe : ఈ ముద్దుగుమ్మదే.. ఆ ఘనత!
- ఆ చక్రాలని నడిపించేది వాళ్లే!
- దాచగలరు..!
- మన గచ్చకాయలాట... కొరియాలో!
'స్వీట్' హోం
- వేసవిలో.. పండ్లు, కూరలు పాడవకుండా..!
- వేసవిలో.. ఇల్లు చల్లగా!
- గోవర్ధనాల గుబాళింపు!
- ఇనుప కడాయిలో ఇవొద్దు!
- Green Vegetables : వీటిని ఎలా వండుతున్నారు?
వర్క్ & లైఫ్
- ఒక్క రోజులోనే.. ఒంటరిగా.. ఆ ప్రాంతాలన్నీ చుట్టేశా!
- ఆ అల్లరి పిల్లే ఇప్పుడు టీచరైంది.. ఈ స్టూడెంట్-టీచర్ కథ చదివారా?!
- ప్రయాణాలకు... చిన్ని సాయాలు!
- ఆర్థికంగా ఎదగాలంటే...
- ఇది మహిళల హోలీ.. మగాళ్లకు నో ఎంట్రీ!