పర్యావరణానికి శుభకరం!

ఇంట్లో శుభకార్యం అంటే వేదికని ఎంత అట్టహాసంగా అలంకరించాలా అని ఆలోచిస్తాం. ఇక ఆ తర్వాత ఎదురయ్యే వ్యర్థాల గురించి మనం పట్టించుకోం. కానీ అవి పర్యావరణానికి ఎంతో హాని చేస్తాయి. మూగజీవాల ఉసురు తీసుకుంటాయి. ఆ సమస్య రాకుండా భూమిలో కలిసిపోయే పూలను తయారుచేస్తూ శభాష్‌ అనిపించుకుంటున్నారు మేరీ డిసౌజా..

Published : 27 Aug 2022 00:15 IST

ఇంట్లో శుభకార్యం అంటే వేదికని ఎంత అట్టహాసంగా అలంకరించాలా అని ఆలోచిస్తాం. ఇక ఆ తర్వాత ఎదురయ్యే వ్యర్థాల గురించి మనం పట్టించుకోం. కానీ అవి పర్యావరణానికి ఎంతో హాని చేస్తాయి. మూగజీవాల ఉసురు తీసుకుంటాయి. ఆ సమస్య రాకుండా భూమిలో కలిసిపోయే పూలను తయారుచేస్తూ శభాష్‌ అనిపించుకుంటున్నారు మేరీ డిసౌజా..

‘ఐదేళ్ల క్రితం.. ఓసారి రోడ్డు పక్కన ఒక ఆవు బాధతో విలవిల్లాడుతోంది. ఏంటా అని ఆరాతీస్తే... రోడ్డుపక్కన పారేసిన పూల దండల్ని ఆ ఆవు తినడం వల్ల అందులోని ఇనుప వైర్లు దాని గొంతులో చిక్కుకున్నాయని చెప్పారు. మనం అలా పారేయకుండా ఉంటే పాపం.. ఆ ఆవుకి ఈ బాధ ఉండేది కాదు కదా’ అని అంటారు కర్ణాటకలోని శివమొగ్గలో ఉంటున్న 58 ఏళ్ల మేరీ డిసౌజా. ఆ ప్రాంతంలో ఉన్న డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ రెసిడెన్షియల్‌ స్కూల్‌లో 29 ఏళ్లుగా క్రాఫ్ట్‌ టీచర్‌గా పనిచేస్తున్నారామె. పిల్లలకు రకరకాల బొమ్మల తయారీ నేర్పే ఆమెకి వ్యర్థాలు మిగల్చని అలంకరణ పూలని తయారుచేస్తే ఎలా ఉంటుందనే ఆలోచన వచ్చింది. ఇందుకోసం ఆమె మిగిలిపోయిన వస్త్రాలు, కాగితాలని వాడి అలంకరణ పూలని తయారుచేయాలని అనుకున్నారు. ఇవి భూమిలోనూ వేగంగా కలిసిపోతాయి. మళ్లీమళ్లీ వాడుకోవచ్చు అంటారామె. అనడమే కాదు అందమైన పూలని తయారుచేసి వాటిని ఉచితంగా అందరికీ అందిస్తున్నారు కూడా. చుట్టుపక్కల టైలర్ల నుంచి సేకరించిన వస్త్రాల రద్దు, ప్రింటింగ్‌ ప్రెస్‌ల నుంచి తీసుకున్న వృథా కాగితమే తాను తయారుచేసే ఉత్పత్తులకు ముడిసరకంటుంది మేరీ. ‘పర్యావరణ పరిరక్షణ చేస్తూ, రీయూజబుల్‌ మెటీరియల్‌తో తయారుచేసే పూలను అలంకరణకు భాగం చేయడం కోసం చాలా ప్రయోగాలు చేశా. ఇందుకు మా అబ్బాయి వివాహ వేడుకే వేదిక అయ్యింది. వివాహ వేదికని పాత చీరలు, వృథా వస్త్రంతో అందంగా అలంకరించా. బంధువులు, ఆహ్వానితులందరూ బాగున్నాయంటూ ప్రశంసించారు. అలా చుట్టుపక్కలవారికి వీటి గురించి తెలిసి వారి కార్యక్రమాలకూ అడగడం మొదలుపెట్టారు. ఆ తర్వాత ప్రభుత్వ, ప్రైవేటు కార్యక్రమాల్లో వేదికల అలంకరణ చేయడానికి అడిగి మరీ అనుమతి తీసుకొని ఈ ఉత్పత్తులని ఉచితంగా అందిస్తున్నా. గతంలో ఏదైనా ఒక వేడుక లేదా కార్యక్రమం జరిగిన తర్వాత ఆ సమీపంలో అలంకరణకు సంబంధించిన వ్యర్థాలన్నీ పడేసేవారు. ఇప్పుడు ఇక్కడ ఆ వ్యర్థాలు తగ్గాయి’ అని చెబుతున్న మేరీ ఈ కళను అందరికీ నేర్పించాలనే లక్ష్యంతో ప్రభుత్వ పాఠశాలలకు వెళ్లి అక్కడ విద్యార్థులకు ఉచితంగా శిక్షణనిస్తోంది.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్