అప్పుడు కూలీలు... ఇప్పుడు వ్యాపారులు!
దేశంలో అత్యంత వెనకబడిన రాష్ట్రాల్లో రాజస్థాన్ ఒకటి. ‘నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో’ 2021 గణాంకాల ప్రకారం మహిళలపై అత్యధికంగా అత్యాచారాలు జరిగింది ఈ రాష్ట్రంలోనే. పేదరికం, నిరుద్యోగం అత్యధికంగా ఉండే ఆ రాష్ట్రంలో ఇప్పుడిప్పుడే పరిస్థితులు మారుతున్నాయి. ఒకప్పుడు కూలీలూ, పనిమనుషులూ
దేశంలో అత్యంత వెనకబడిన రాష్ట్రాల్లో రాజస్థాన్ ఒకటి. ‘నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో’ 2021 గణాంకాల ప్రకారం మహిళలపై అత్యధికంగా అత్యాచారాలు జరిగింది ఈ రాష్ట్రంలోనే. పేదరికం, నిరుద్యోగం అత్యధికంగా ఉండే ఆ రాష్ట్రంలో ఇప్పుడిప్పుడే పరిస్థితులు మారుతున్నాయి. ఒకప్పుడు కూలీలూ, పనిమనుషులూ, గృహిణులుగా ఉన్నవాళ్లు స్వయం ఉపాధి వైపు అడుగులు వేస్తూ ఆర్థిక స్వావలంబన సాధిస్తున్నారు. ఈ మార్పు ఎలా వస్తోందంటే...
పూరన్ రవిదాస్ కూలీగా పనిచేస్తూ రోజుకి రూ.100-200 సంపాదించేది. ఏడాది కిందట ఓ స్వయం సహాయక బృందంలో చేరి మసాలా పొడుల తయారీ మొదలుపెట్టింది. ఇప్పుడామె ఆదాయం రెట్టింపైంది. అంతేకాదు, పని వాతావరణమూ మారింది. ఈమెది రాజస్థాన్‌లోని ప్రతాప్‌గఢ్ జిల్లా. ‘ఏడాది కిందట ప్రభుత్వ అధికారులు వచ్చి వీటి గురించి చెప్పారు. ప్రయత్నించి చూద్దామనుకున్నా. మా బృందంలో 13 మందిమి ఉన్నాం. మేమంతా మసాలా దినుసుల్ని విడివిడిగా తయారుచేస్తాం. త్వరలో మా ప్రాంతంలో ప్రఖ్యాతి అయిన ‘ప్రతాప్‌గఢ్ మసాలా’ రకాన్ని మార్కెట్లోకి తేనున్నాం’ అని ఎంతో ఆత్మవిశ్వాసంతో చెబుతోంది పూరన్.
ఆన్‌లైన్‌లోనూ అమ్మకాలు..
చురు ప్రాంతానికి చెందిన గృహిణి సుమిత్రా దేవీదీ ఇలాంటి కథే. ఈమె గడప దాటడం చాలా అరుదు. 2019లో సబ్బుల తయారీలో శిక్షణ తీసుకుంది. ‘శిక్షణ తర్వాత సొంతంగా వివిధ రకాల సబ్బుల తయారీకి ప్రయత్నించాం. అందులో చార్కోల్ సబ్బుకి బాగా ఆర్డర్లు వచ్చాయి. దాంతో ఎక్కువగా ఆ సబ్బులనే చేస్తున్నాం. ఒక్కో సబ్బు ధర రూ.50-80 వరకూ ఉంటుంది’ అంటారు సుమిత్ర. ప్రారంభంలో ఈమె బృందంలో 15 మంది ఉండగా ఇప్పుడా సంఖ్య రెట్టింపు అయింది. వ్యాపారం ఎన్నో రెట్లు పెరిగింది. సుమిత్ర నాయకత్వ లక్షణాలు చూసి తన బృందానికి నేతృత్వం వహించే బాధ్యతనీ అప్పగించారు. రాజస్థాన్ ప్రభుత్వ ప్రోత్సాహకాలతో స్వయం సహాయక బృందాలు ఇప్పుడిప్పుడే పుంజుకుంటున్నాయి. సులభంగా రుణాలూ, నైపుణ్యాల్లో శిక్షణ విషయాల్లో వీరికి సాయపడుతోంది రాజీవికా (రాజస్థాన్ గ్రామీణ్ ఆజీవికా వికాస్ పరిషత్) పథకం. ఈ అవకాశాన్ని మహిళలూ సద్వినియోగం చేసుకుంటున్నారు. హస్తకళలు, సబ్బులు, మసాలా దినుసులు.. ఇలా భిన్న రకాల వస్తువుల తయారీలోకి అడుగుపెడుతున్నారు. స్వయం సహాయక బృందాల ఉత్పత్తుల అమ్మకాల కోసం రాష్ట్ర, జాతీయ స్థాయులో ఏర్పాటుచేసే ఎగ్జిబిషన్లలో స్టాళ్ల ఏర్పాటులో ప్రభుత్వం వీరికి దన్నుగా ఉంటోంది. కార్పెట్లు, అలంకరణ వస్తువులు, ఎంబ్రాయిడరీ పెయింటింగ్, పచ్చళ్లు, ఇనుప వంట సామాగ్రి... మొదలైనవి తయారుచేసి అమ్ముతారు వీళ్లు. అమెజాన్‌లోనూ వీరి ఉత్పత్తులు అందుబాటులో ఉండేలా ఆ సంస్థతో ఒప్పందం కుదుర్చుకున్నారు. రాష్ట్రంలో 2.7 లక్షల స్వయం సహాయక బృందాలు ఉండగా వాటిద్వారా 30 లక్షల మంది మహిళలు ఉపాధి పొందుతున్నారు. వీరు తయారు చేసిన వస్తువులకు సరసమైన ధర అందేట్టు చూస్తామంటున్నారు ‘రాజీవికా’ను పర్యవేక్షించే ఆ రాష్ట్ర పంచాయతీ రాజ్ విభాగ అధికారులు. రాజస్థాన్ హస్తకళలకు ప్రసిద్ధి. కానీ ఒకప్పుడు అవన్నీ పురుషులకే పరిమితం. ఇప్పుడు మహిళలు రావడంతో అవి మరింత వెలుగులోకి వస్తున్నాయి. ఆధునిక పద్ధతుల్లో మార్కెట్ చేయడంతో ఆదాయాన్నీ తెస్తున్నాయి. ఆర్థిక స్వావలంబన ఈ మహిళల జీవితాల్లో వెలుగులు నింపాలని కోరుకుందాం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
బ్యూటీ & ఫ్యాషన్
- వేసవిలో ట్యాన్ సమస్య తగ్గాలంటే..!
- అడ్డిగ... అందాల నగ!
- ఇలా చేస్తే.. అందం తగ్గదు..!
- నాకు ఏ క్రీమ్?
- స్ట్రెచ్ మార్క్స్.. తగ్గట్లేదా..?
ఆరోగ్యమస్తు
- అందుకే వీటిని ఇలా తీసుకోవాలట..!
- వసంతంలో ఆరోగ్య జాగ్రత్తలు..!
- ప్రెగ్నెన్సీ.. ఈ జాగ్రత్తలు పాటిస్తున్నారా?
- ఉత్తేజంగా మారాలంటే..!
- రక్తహీనత తగ్గించే బీట్రూట్!
అనుబంధం
- ఒక మెట్టు దిగితే చాలు...
- ఆ అమ్మాయితో ఆ చాటింగ్.. ఆయన్ని నమ్మలేకపోతున్నా..!
- అలా చదివితే మేలే...
- చిన్నవే... చక్కదిద్దుతాయి!
- యుక్త వయసు నుంచీ...!
యూత్ కార్నర్
- అప్పుడు ఫ్యాన్... ఇప్పుడందరి ఫేవరెట్!
- భూగోళాన్ని చుట్టేస్తానంటోంది!
- దాంతో మాట్లాడుతుంటే మతి పోయిందనేవాళ్లు!
- ఎరీ... ఆ ఊరి పట్టు..!
- అందరికీ నచ్చేవి.. నాకు నచ్చవు.. ఎందుకిలా?
'స్వీట్' హోం
- పుల్లటి పెరుగుతో.. పెరిగే రుచి!
- రిస్క్ లేకుండా దాచేద్దాం!
- వేసవిలో ఇల్లు చల్లగా...
- కళ్లు తిరిగే కార్పెట్లు...
- ఆ చోటు గుర్తిస్తే చాలు...
వర్క్ & లైఫ్
- మీకు ‘ట్రావెలింగ్’ అంటే ఇష్టమా..?
- పనికి ‘బ్రేక్’ వేయండి!
- ఇవి టైంపాస్ కోసమే కాదు.. సంపాదనకూ..!
- మారాలని గట్టిగా అనుకోండి!
- Samantha: చిన్న చిట్కాలతోనే 45 కిలోల బరువు తగ్గా..!