వయసు 57.. జోరు 16

అయిదేళ్ల మనవడిని తీసుకుని సైకిల్‌ కొనడానికి వెళ్లిన 51 ఏళ్ల రేణూ సింఘి.. మనసాగక తనూ ఓ సైకిల్‌ కొనుక్కొన్నారు. దానిమీద జయపుర రోడ్లపై షికారు చేస్తూ బాల్యంలోకి వెళ్లొచ్చేవారు. ఆమె సైకిల్‌ ప్రయాణం అక్కడికే పరిమితం కాలేదు.

Updated : 07 Sep 2022 09:06 IST

అయిదేళ్ల మనవడిని తీసుకుని సైకిల్‌ కొనడానికి వెళ్లిన 51 ఏళ్ల రేణూ సింఘి.. మనసాగక తనూ ఓ సైకిల్‌ కొనుక్కొన్నారు. దానిమీద జయపుర రోడ్లపై షికారు చేస్తూ బాల్యంలోకి వెళ్లొచ్చేవారు. ఆమె సైకిల్‌ ప్రయాణం అక్కడికే పరిమితం కాలేదు. తాజాగా ఇంగ్లాండ్‌లో 1500 కి.మీ. సైకిల్‌ సవారీలో రికార్డు సృష్టించారామె. ఇదెలా సాధ్యమైందంటే...

రేణూ సింఘీకి చిన్నప్పట్నుంచీ ఆటలంటే ఇష్టం. స్కూల్లో బ్యాడ్మింటన్‌, రన్నింగ్‌ ప్రాక్టీసు చేసేవారు. కుటుంబ నేపథ్యం కారణంగా ఆ తర్వాత చదువుమీద దృష్టి పెట్టాల్సి వచ్చింది. భూగర్భశాస్త్రం, చరిత్రలలో పీజీలు చేశారామె. రేణూ వాళ్లది రాజస్థాన్‌లోని జయపుర. భర్త వ్యాపారి. ఇద్దరు అబ్బాయిలు. పిల్లలకీ పెళ్లిళ్లయ్యాయి. కానీ క్రీడలపైన ఇష్టం, అటువైపు వెళ్లలేకపోయానన్న అసంతృప్తి మాత్రం అలానే ఉండిపోయాయి. చివరకు బామ్మ అయ్యాక సైక్లింగ్‌ చేస్తూ తృప్తిపడదామనుకున్నారు రేణు. సైకిల్‌ కొన్న కొత్తల్లో రోజూ 10, 15 కి.మీ. తొక్కేవారు. ఆ క్రమంలోనే ‘ఉన్నది ఒక్కటే జీవితం, రాదు మరో అవకాశం’ అనుకుని స్థానిక సైక్లింగ్‌ క్లబ్‌లో చేరారు. తన ఉత్సాహానికి కుటుంబసభ్యుల ప్రోత్సాహం తోడై ప్రొఫెషనల్‌ సైక్లిస్ట్‌గా మారారు రేణు. ఆపైన దేశంలో ప్రముఖ రేసుల్లో పాల్గొన్నారు. వాటిలో శ్రీనగర్‌-లేహ్‌ మధ్య చేసిన 424 కి.మీ. రేసు ఒకటి. 2019లో 1220కి.మీ. పారిస్‌ రేసుని 92 గంటల్లో పూర్తిచేశారీమె. ఈమధ్యే 1540 కి.మీ. లండన్‌ సైకిల్‌ రేసులోనూ పాల్గొన్నారు. ప్రపంచం నలుమూలల నుంచీ దీన్లో 1900 మంది పాల్గొన్నారు. 128 గంటల్లో పూర్తిచేయాలన్నది నిబంధన కాగా.. 124 గంటల, 32 నిమిషాల్లోనే పూర్తిచేశారు రేణు.


కష్టమైన పనినీ ఇష్టంతో చేసే మహిళలకు వయసు, కుటుంబం... ఇవేవీ అడ్డంకిగా నిలవకూడదన్నది నా అభిప్రాయం.  ఈ విషయంలో ఏ కొద్ది మంది మహిళలకు స్ఫూర్తిగా నిలిచినా నా కోరిక నెరవేరినట్లే!’.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని