పల్లెటూరి నుంచి.. అంతరిక్షంలోకి!
అమ్మ వస్త్ర పరిశ్రమలో కార్మికురాలు. నాన్న ట్రాక్టర్ డ్రైవర్. ఇదీ వాలెంటీనా తెరెష్కోవా నేపథ్యం. వీళ్లది రష్యాలోని చిన్న పల్లె. ఆమెకు రెండేళ్లప్పుడు నాన్న పోయారు. ఆర్థిక పరిస్థితి బాలేక తనూ వస్త్రపరిశ్రమలో చేరారు. దూరవిద్య ద్వారా చదువుకున్నారు.
అక్టోబరు 4 - 10 అంతరిక్ష వారోత్సవం
అమ్మ వస్త్ర పరిశ్రమలో కార్మికురాలు. నాన్న ట్రాక్టర్ డ్రైవర్. ఇదీ వాలెంటీనా తెరెష్కోవా నేపథ్యం. వీళ్లది రష్యాలోని చిన్న పల్లె. ఆమెకు రెండేళ్లప్పుడు నాన్న పోయారు. ఆర్థిక పరిస్థితి బాలేక తనూ వస్త్రపరిశ్రమలో చేరారు. దూరవిద్య ద్వారా చదువుకున్నారు. స్కైడైవింగ్ మీద ఆసక్తితో ఏరో క్లబ్‌లో శిక్షణ తీసుకుని 126 పారాచ్యూట్ జంప్‌లు చేశారు. 1962లో సోవియట్ యూనియన్ అమ్మాయిలకూ అంతరిక్ష అవకాశం ఇవ్వాలనుకుంది. అమెరికా 1959లోనే ఆ దిశగా అడుగులు వేసినా కొనసాగించలేకపోయింది. అమెరికాకు పోటీగా రష్యా మహిళా వ్యోమగాములను తీర్చిదిద్దాలనుకుంది. 400 దరఖాస్తుల్లో నలుగురిని ఎంపికచేసింది. వారిలో తెరెష్కోవా ఒకరు. 18 నెలల శిక్షణ తర్వాత జూన్ 16, 1963లో అంతరిక్షంలోకి అడుగుపెట్టి, మొదటి మహిళ, అతిపిన్న వయస్కురాలిగానూ నిలిచారు. తొలి సివిలియన్, ఒంటరిగా ప్రయాణించిన మహిళ కూడా. భూమి చుట్టూ 48 ప్రదక్షిణలు చేసి, జూన్ 18న తిరిగొచ్చారు. మూడ్రోజుల యాత్రలో స్పేస్‌క్రాఫ్ట్ సాఫ్ట్‌వేర్‌లో సమస్యలను తనే గుర్తించి, పరిష్కరించుకున్నారు. తర్వాత వైమానిక దళంలో కల్నల్ నుంచి మేజర్ స్థాయికి ఎదిగారు. ఏరోనాటిక్స్‌లో పీహెచ్‌డీ చేసి వ్యోమగాములకు శిక్షణిచ్చారు. ఒంటి రెక్కతో పక్షి ఎగరలేనట్లే.. వ్యోమనౌకల అభివృద్ధి మహిళల భాగస్వామ్యం లేనిదే సాధ్యం కాదంటారీవిడ. ‘నా దగ్గర డబ్బుంటే తిరిగి రాకపోయినా ఫర్లేదు.. మార్స్‌కు వెళ్లిపోతా. ప్రభుత్వాలు యుద్ధాల మీద కాక ఆస్టరాయిడ్స్ వంటి ప్రమాదాల నుంచి భూమినెలా కాపాడాలన్న దానిపై దృష్టి పెట్టాల’ని కోరేవారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.