వాళ్లే ఆ లోటు భర్తీ చేయాలి...

సైన్స్‌ రంగాల్లో ఉన్న స్త్రీల సంఖ్య తక్కువే. అందులోనూ పరిశోధనల్లో నాయకత్వం తీసుకున్నవారైతే మరీ అరుదు. స్టెమ్‌ రంగాల్లో ఉన్న ఆడపిల్లలు...పెద్ద పెద్ద సవాళ్లను తీసుకోవడానికి ముందుకు రావాలి.

Published : 11 Oct 2022 00:28 IST

సైన్స్‌ రంగాల్లో ఉన్న స్త్రీల సంఖ్య తక్కువే. అందులోనూ పరిశోధనల్లో నాయకత్వం తీసుకున్నవారైతే మరీ అరుదు. స్టెమ్‌ రంగాల్లో ఉన్న ఆడపిల్లలు...పెద్ద పెద్ద సవాళ్లను తీసుకోవడానికి ముందుకు రావాలి. వాటిని సొంతంగా పూర్తిచేసినా, ఇతరుల సహకారం తీసుకున్నా సరే లోతుల్లోకి వెళ్లి శోధించగలగాలి. అందివచ్చిన ఏ అవకాశాన్నీ వదులుకోకుండా వంద శాతం ప్రయత్నించినప్పుడే వారి సామర్థ్యం సమాజానికీ అర్థమవుతుంది. ఆయా రంగాల్లో ఉన్న లోటు కూడా భర్తీ అవుతుంది. స్త్రీ, పురుషులు ఒకే పనిని సమానంగా చేయగలుగుతున్నా...దాన్ని పూర్తి చేసిన విధానం కూడా కీలకమే. అందుకే, ఈ విషయంలో వందశాతం దృష్టిపెట్టగలగాలి. అలానే, నాయకత్వ బాధ్యతలు తీసుకున్న మహిళలు ఇతర మహిళలకు చేయూతనిచ్చినప్పుడే మహిళా సాధికారత సాధ్యమవుతుంది.

- గగన్‌దీప్‌ కాంగ్‌, ప్రముఖ వైరాలజిస్ట్‌, రాయల్‌సొసైటీ ఫెలోగా ఎంపికైన తొలి మహిళా భారతీయ శాస్త్రవేత్త.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని