నచ్చినట్లు జీవించే హక్కు అందరిదీ..
కలలు కనకపోతే.. జీవించడానికి అర్హత లేనట్లే. ఎంతటి వేదన కలిగించిన నష్టాన్ని ఎదుర్కొన్నప్పుడైనా మనల్ని మనం ఉత్తేజపరుచుకుంటూ కొత్త పాఠాలను నేర్చుకోవాలి. నిత్యం నేను మరుసటి రోజు సాధించబోయే విజయాన్ని లక్ష్యంగా పెట్టుకొని ముందడుగు వేస్తుంటా.
కలలు కనకపోతే.. జీవించడానికి అర్హత లేనట్లే. ఎంతటి వేదన కలిగించిన నష్టాన్ని ఎదుర్కొన్నప్పుడైనా మనల్ని మనం ఉత్తేజపరుచుకుంటూ కొత్త పాఠాలను నేర్చుకోవాలి. నిత్యం నేను మరుసటి రోజు సాధించబోయే విజయాన్ని లక్ష్యంగా పెట్టుకొని ముందడుగు వేస్తుంటా. క్రీడాకారిణిగా ఎప్పుడూ తృప్తి పడను. ఎవరైనా సరే ఆశావహంగానే ఉండాలి. నిన్న, నేటి కన్నా.. రేపటి కోసం ఎదురు చూస్తూ, గతంకన్నా ఉత్తమ ఫలితాలను కోరుకుంటూనే ఉండాలి. అప్పుడే మరింత మెరుగైన ఆటను ప్రదర్శించగలమని నమ్ముతా. ప్రతి ఒక్కరికీ తమ అభిప్రాయాన్ని చెప్పడానికి హక్కు ఉంది. అలానే నా అభిప్రాయాన్ని చెప్పడానికి నాకూ స్వేచ్ఛ ఉంటుందని భావిస్తా. మనకోసం మనం జీవించడంలోనే నిజమైన ఆనందం ఉంది. సెలబ్రిటీలు కూడా మనుషులే, వారికీ మనసుంటుందని ప్రజలు మర్చిపోతుంటారు. బాధ, ఏడుపు, విచారం, నవ్వు వంటివన్నీ మాకూ ఉంటాయి. నేనైతే, ఎవరినో మెప్పించడం కోసం కాకుండా, నా దేశం కోసం, నా కోసం మాత్రమే ఆడతాను, జీవిస్తాను. అంతమాత్రాన ప్రజలేం మాట్లాడతారు, ఆలోచిస్తారు అనేవి మారబోవు. అందుకే మన మనసేం చెబుతోందో అదే చేయాలి. అప్పుడే విజయంతోపాటు ఆత్మతృప్తి.
- సానియా మీర్జా, ప్రముఖ టెన్నిస్ క్రీడాకారిణి
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.