ఆ వాతావరణం కల్పించారా!

నా భర్త చనిపోయినప్పుడు చాలా భయపడ్డా. ఉద్యోగం చేశా కానీ వ్యాపార నిర్వహణ అనుభవం నాకు లేదు మరి. అసలు.. ఆడవాళ్లు వ్యాపారవేత్తలవుతారన్న విషయమే తెలియదు నాకు.

Published : 17 Nov 2022 00:33 IST

అనుభవ పాఠం

నా భర్త చనిపోయినప్పుడు చాలా భయపడ్డా. ఉద్యోగం చేశా కానీ వ్యాపార నిర్వహణ అనుభవం నాకు లేదు మరి. అసలు.. ఆడవాళ్లు వ్యాపారవేత్తలవుతారన్న విషయమే తెలియదు నాకు. మా ఇంట్లో అలాంటి వాతావరణమే ఉండేది. ఎవరిమీదైనా కోపం చూపినా, ఏడ్చినా.. ‘పెళ్లి చేసుకొని అత్తారింటికి వెళ్తావ్‌.. అక్కడేం చేస్తావ్‌?’... ఇలా ఏ విషయం లోనైనా ఈ వాక్యం తప్పక ఉండేది. ఇక స్ఫూర్తి పొందే అవకాశమేది? మా ఇల్లనే కాదు.. చాలా మంది అమ్మాయిని పెళ్లికి సిద్ధం చేయడమే గానీ.. కెరియర్‌ మార్గంలో నడిపించాలనుకోరు. పెళ్లి విషయంలోనూ అభిప్రాయం అడగరు. అందుకే ‘నేనెలా చేయగలను?’ అని భయపడ్డా. నెమ్మదిగా నేర్చుకుంటూ వచ్చాక కానీ అర్థం కాలేదు. నాయకత్వానికి ఆడామగా తేడా ఉండదని. అందుకే నా పిల్లల విషయంలో అలా వివక్ష చూపలేదు. మా అమ్మాయి మెహర్‌కి ఇలానే ఉండాలన్న ఆంక్షలూ పెట్ట లేదు. నీకు నువ్వులా ఉండు.. ఎవరినీ అనుసరించొద్దు అని మాత్రం చెప్పా. అందుకే ఏదైనా ధైర్యంగా ప్రయత్నించేది. ఇప్పుడు సంస్థ ఛైర్‌పర్సన్‌గా రాణించడానికీ ఆ ధైర్యమే కారణం. ఏ అమ్మాయైనా ఏదైనా సాధించాలా.. ముందు ఇంట్లో ఆ వాతావరణం కల్పించండి.

- అను అగా, మాజీ ఛైర్‌పర్సన్‌, థర్మాక్స్‌

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని