అప్పుడే నాయకురాళ్లవుతారు!

‘అదృష్టవంతురాలు... కుటుంబ వ్యాపారమేగా చక్కగా చూసుకోవచ్చు’ మా హోటల్స్‌ పగ్గాలు చేపట్టినప్పుడు అందరూ అన్న మాటలివి. పెద్ద అనుభవం లేదు.

Updated : 23 Nov 2022 04:47 IST

అనుభవపాఠం

‘అదృష్టవంతురాలు... కుటుంబ వ్యాపారమేగా చక్కగా చూసుకోవచ్చు’ మా హోటల్స్‌ పగ్గాలు చేపట్టినప్పుడు అందరూ అన్న మాటలివి. పెద్ద అనుభవం లేదు. నాన్న చనిపోయారు. పాతికేళ్లు నిండగానే బాధ్యతలు అందుకోవడం అంత సులువు కాదు. ఏమాత్రం తప్పటడుగు వేసినా ఉన్న పేరూ ప్రతిష్ఠా పోయే ప్రమాదముంది. అయితే నేనెప్పుడూ భయపడలేదు. కారణం.. ఏదో ఒక రోజు ఈ వ్యాపారాల బాధ్యతలను నిర్వర్తించాలన్న పద్ధతిలోనే అమ్మానాన్నా నన్ను, చెల్లినీ పెంచారు. అందుకు తగ్గ వాతావరణాన్నీ కల్పించారు. అందుకే చదువవ్వగానే నాన్న దగ్గర మార్కెటింగ్‌ మేనేజర్‌గా చేరా. అప్పటిదాకా నాన్న తోడున్నారు, నేర్చుకోవచ్చన్న ధైర్యం ఉండేది. ఆయన దూరమయ్యాక ఆయన నమ్మకాన్ని నిలబెట్టాలన్న బాధ్యత పెరిగింది. అందుకే ఎన్ని సవాళ్లెదురైనా ధైర్యంగా ఎదుర్కొంటూనే వ్యాపారాన్ని అభివృద్ధి చేశా. ఏ మనిషి ఎదుగుదలలోనైనా కుటుంబానిదే ప్రధాన పాత్ర. నా విషయంలోనూ అంతే! అమ్మాయిలూ చేయగలరు అని మా ఇంట్లో నమ్మారు కాబట్టే.. ధైర్యంగా నిలబడగలిగాం. ఆ తోడ్పాటు ప్రతి ఇంట్లోనూ అందాలి. అప్పుడే.. మరింత మంది నాయకురాళ్లు తయారవుతారు!

- ప్రియా పాల్‌, ఛైర్‌పర్సన్‌, పార్క్‌ హోటల్స్‌

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని