Published : 23/02/2023 00:05 IST

వాళ్లకా స్వేచ్ఛనిచ్చా కాబట్టే..

కోట్లకు అధిపతినవ్వాలని వ్యాపారంలో అడుగుపెట్టలేదు. ఏ పని చేసినా ది బెస్ట్‌ అని మనసుకు అనిపించేలా చేయడమే నా లక్ష్యం. నా బృందానికీ స్వేచ్ఛగా పనిచేసే వాతావరణాన్ని కల్పించాను. ఇదే 2021లో సొంతంగా ఎదిగిన ధనికుల జాబితాలో మూడోస్థానాన్ని దక్కించుకొనేలా చేసింది. నాన్న మద్రాసు ఉన్నత న్యాయస్థానంలో స్టెనోగ్రాఫర్‌గా పనిచేసేవారు. చెన్నై ఐఐటీలో నేను ఇండస్ట్రియల్‌ మేనేజ్‌మెంట్‌ చదివే సమయానికి అన్నయ్య శ్రీధర్‌ అడ్వెన్‌ నెట్‌ ప్రారంభించాడు. ఆ తర్వాత సాఫ్ట్‌వేర్‌ సంస్థ జోహో కార్పొరేషన్స్‌ మొదలుపెట్టి, దాంతో ఆ సంస్థను విలీనం చేశాడు. అప్పటికి నా చదువు పూర్తవడంతో మొదట ప్రొడక్ట్‌ మేనేజర్‌గా జోహో మెయిల్‌లో చేరా. నాకంటూ కొన్ని సిద్ధాంతాలను ఏర్పరుచుకుని పాటిస్తూ.. అతి కొద్దికాలంలోనే ప్రపంచంలోనే అతి పెద్ద బిజినెస్‌ ఈ మెయిల్‌ ప్రొవైడర్స్‌ సంస్థల్లో జోహోను ఒకటిగా నిలపగలిగా. ప్రస్తుతం జోహోకు ప్రపంచవ్యాప్తంగా 12 శాఖలుండగా ఆరుకోట్ల మంది మా సేవలు అందుకుంటున్నారు.

- రాధ వెంబు, సహ వ్యవస్థాపకురాలు, జోహో కార్పొరేషన్‌


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని