వారసులను తయారు చేస్తున్నారు!

కాలానికి తగ్గట్టుగా ఎన్నో మార్పులు. ఆ వేగంలో తమ సంస్కృతీ, సంప్రదాయాలూ కనుమరుగవ్వడం గమనించారు నాగాలాండ్‌ మహిళలు. కొత్తతరాలకు అవి కనీసం పరిచయం కాకపోవడం వాళ్లని బాధించింది. పేరుకే చిన్నదైనా నాగాలాండ్‌ ప్రత్యేకత అక్కడి ప్రజల జీవనవిధానాలే.

Updated : 03 Jun 2023 04:46 IST

కాలానికి తగ్గట్టుగా ఎన్నో మార్పులు. ఆ వేగంలో తమ సంస్కృతీ, సంప్రదాయాలూ కనుమరుగవ్వడం గమనించారు నాగాలాండ్‌ మహిళలు. కొత్తతరాలకు అవి కనీసం పరిచయం కాకపోవడం వాళ్లని బాధించింది. పేరుకే చిన్నదైనా నాగాలాండ్‌ ప్రత్యేకత అక్కడి ప్రజల జీవనవిధానాలే. ప్రధానంగా 17, మరి కొన్ని చిన్న తెగలు ఉంటాయక్కడ. ప్రతిదానికీ ప్రత్యేక భాష వారి సొంతం. అవన్నీ అంతరించి పోతోంటే తట్టుకోలేక తమ సంస్కృతికి వారసులను తయారు చేయాలనుకున్నారు.

మహిళలంతా ఓ బృందంగా ఏర్పడి 2012లో ‘లిది క్రో-యూ’ అనే ఎన్‌జీఓను ప్రారంభించారు. దీనిద్వారా నేత, సంప్రదాయ వంటలు, వస్త్రాలు, నగల తయారీ, జానపద పాటలు, నృత్యరీతులు, వెదురు అల్లికలు.. ఇలా ప్రతిదాన్నీ నేర్పిస్తున్నారు. ప్రదర్శనలూ ఏర్పాటు చేస్తున్నారు. దీంతో యువతా ఆసక్తిగా నేర్చుకుంటోందట. ఈ అమ్మల స్ఫూర్తితో అక్కడి స్కూళ్లు, కళాశాలలు కూడా సంస్కృతిని కాపాడుకోవాల్సిన ఆవశ్యకతను గుర్తించి, వీళ్లతో చేతులు కలిపాయి. 2019లో ‘తెజానో ద మ్యూజికల్‌’ అనే డాక్యుమెంటరీని రూపొందించి ప్రధాని మెప్పూ పొందారు. వీరి ప్రయత్నాన్ని ఆ మధ్య ‘మన్‌ కీ బాత్‌’లో మెచ్చుకున్నారాయన. తాజా 100వ ఎపిసోడ్‌లో వారి ఉద్దేశాన్ని వివరించే అవకాశమూ ఇచ్చారు. సంస్కృతి గొప్పదనాన్ని కాపాడటం కోసం ఈ మహిళలు చేస్తున్న కృషి అభినందనీయమే కదూ!

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్