ఇదేం.. ఆలోచన అన్నారు

మాది వ్యవసాయ కుటుంబం. చదువుకుంటానంటే నాన్న ఒప్పుకోలేదు. ఇంట్లో వాళ్లకి తెలియకుండా పాఠశాలకు వెళ్తే కొట్టారు. ఆడపిల్లకు చదువెందుకని ఇంటి పనులకే పరిమితం చేశారు. పనులన్నీ అయిపోయాక బాబాయి నేత పని చేస్తున్నప్పుడు ఆసక్తిగా అనిపించి చూసేదాన్ని. అడిగితే నాకూ నేర్పించారు. ఇంతలోనే పెళ్లి. ముగ్గురు పిల్లలు పుట్టాక భర్త అనారోగ్యంతో మృతి చెందాడు.

Updated : 30 Jun 2023 06:12 IST

రాజీబెన్‌ వన్‌కర్‌, కారీగారీ క్లినిక్‌

మాది వ్యవసాయ కుటుంబం. చదువుకుంటానంటే నాన్న ఒప్పుకోలేదు. ఇంట్లో వాళ్లకి తెలియకుండా పాఠశాలకు వెళ్తే కొట్టారు. ఆడపిల్లకు చదువెందుకని ఇంటి పనులకే పరిమితం చేశారు. పనులన్నీ అయిపోయాక బాబాయి నేత పని చేస్తున్నప్పుడు ఆసక్తిగా అనిపించి చూసేదాన్ని. అడిగితే నాకూ నేర్పించారు. ఇంతలోనే పెళ్లి. ముగ్గురు పిల్లలు పుట్టాక భర్త అనారోగ్యంతో మృతి చెందాడు. తల్లిదండ్రుల కష్టాలు చూసి పుట్టింటికి వెళ్లలేకపోయాను. చదువు లేదు. కూలి పనులకు వెళ్తే యజమానులు అసభ్యంగా ప్రవర్తించేవారు. దిక్కుతోచని స్థితిలో చెల్లెలి ఇంటికి వెళ్లాను. అక్కడే సంప్రదాయ వృత్తులను కాపాడుతున్న ఒక ఎన్జీఓ గురించి తెలుసుకున్నా. నేయడం తెలుసని చెపితే  ఉద్యోగంలో పెట్టుకున్నారు. అక్కడ చాలా మెలకువలు నేర్చుకున్నా. నేత పని అంటే ఎవరైనా ఊహించేది చీరలు, దుప్పట్లు, చున్నీలు వగైరా... అదీ వస్త్రంతో నేస్తారు. అప్పటికి ప్లాస్టిక్‌ వాడకాన్ని తగ్గించాలన్న ఉద్యమం నడుస్తోంది. వాడి పడేసే పాలిథీన్‌ కవర్లను సేకరించి వాటికి మంచి రూపం ఇవ్వాలనుకున్నా. బ్యాగ్స్‌, మ్యాట్స్‌, పర్సులు లాంటి గృహోపకరణాలను తయారు చేయాలనుకున్నా. తోటి వాళ్లకి ఇది చెప్పినప్పుడు కొట్టిపడేశారు. పనికిరాని ఆలోచనని హేళన చేశారు. పట్టుదలతో దీన్ని ఆచరణలోకి తీసుకువచ్చాను. ఇప్పుడు గ్రామంలో 70 మంది దీని ద్వారా ఉపాధి పొందుతున్నారు. మహిళల్లో ఆర్థికస్వావలంబనే లక్ష్యంగా పనిచేస్తున్నా.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని