ఇల్లు అమ్మడం పిచ్చిపని అన్నారు
పుట్టి పెరిగింది వ్యాపారవేత్తల కుటుంబంలో. ఊహ తెలిసినప్పటి నుంచి నేనూ ఏదైనా వ్యాపారం చేయాలని అనుకునేదాన్ని. కానీ చదువు పూర్తవగానే పెళ్లైంది. ఆయన వెంచర్ కాపిటలిస్ట్. ఇక నా కెరియర్ ముగిసిపోయింది అనుకున్నాను. కానీ తను మాత్రం ‘నీకు నచ్చింది చేయ’మన్నారు. ఇద్దరికీ ప్రయాణాలంటేే ఇష్టం.
మోనికా గుప్తా, క్రాఫ్ట్‌విల్లా.కామ్, వ్యవస్థాపకురాలు
పుట్టి పెరిగింది వ్యాపారవేత్తల కుటుంబంలో. ఊహ తెలిసినప్పటి నుంచి నేనూ ఏదైనా వ్యాపారం చేయాలని అనుకునేదాన్ని. కానీ చదువు పూర్తవగానే పెళ్లైంది. ఆయన వెంచర్ కాపిటలిస్ట్. ఇక నా కెరియర్ ముగిసిపోయింది అనుకున్నాను. కానీ తను మాత్రం ‘నీకు నచ్చింది చేయ’మన్నారు. ఇద్దరికీ ప్రయాణాలంటేే ఇష్టం. అదే నా వ్యాపారానికి బీజం వేసింది. ఎప్పటిలానే ఒకరోజు గుజరాత్‌లోని కచ్ ప్రాంతం తిరిగొద్దామని వెళ్లాం. అక్కడ ఏ ఇంట్లో చూసినా గోడలపై ఏదో ఒక కళ కనిపించింది. అదే వాళ్లకి జీవనాధారం. కానీ ఆదాయం శూన్యం. అక్కడ రూ.50కి అమ్మే వస్తువులు, పట్టణాల్లో రూ.500 దాకా పలుకుతున్నాయి. వీళ్లకి మంచి వేదికని ఏర్పాటు చేయడంతో పాటు, దాన్నే వ్యాపార సాధనంగా మార్చాలి అనుకున్నా. నా ఆలోచనను మావారితో పంచుకుంటే ప్రోత్సహించారు. కానీ మా ఇరు కుటుంబాలే ఒప్పుకోలేదు. ఐఐటీ, ఐఐఎమ్‌ల్లో చదివి ఇదేం పని అన్నారు. పట్టించుకోకుండా 2011లో సంప్రదాయ కళలను పరిచయం చేసే ఆన్‌లైన్ వేదికను ప్రారంభించాం. పెట్టుబడి కోసం ఇల్లు అమ్మేశాం. అందరూ మేం చేస్తున్నది పిచ్చిపని అన్నారు. ఏదేదో చెప్పి భయపెట్టడానికి ప్రయత్నించారు. అయినా తగ్గలేదు. మేం తీసుకున్న నిర్ణయం మీద అంత నమ్మకం మాకు. ఈ పన్నెండేళ్లలో ఎన్నో ఎత్తుపల్లాలు చూశాం. అన్నింటిని ధైర్యంగా కలిసి ఎదుర్కొన్నాం. ఎన్ని క్లిష్ట పరిస్థితులు ఎదురైనా తీసుకున్న నిర్ణయం మీద నిలబడిగలిగినప్పుడే విజయం సొంతం చేసుకోగలం. అందుకు మేమే ఉదాహరణ! ఇప్పుడు క్రాప్ట్‌విల్లా ఆధ్వర్యంలో ఆరు వేర్వేరు ఆన్‌లైన్ వెబ్‌సైట్స్ ఉన్నాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.