గ్రేవీలో నూనె ఎక్కువైందా?

వంటిల్లనే ప్రయోగశాలలో మహిళలు కొత్తవి కనిపెడుతూనే ఉంటారు. కొన్ని సార్లు పొరపాట్లు జరుగుతుంటాయి. మరి వాటిని సరిదిద్దుకుని వంటల రుచులను పెంచుకోవడం ఎలానో చూడండి...

Published : 29 Jul 2021 01:14 IST

వంటిల్లనే ప్రయోగశాలలో మహిళలు కొత్తవి కనిపెడుతూనే ఉంటారు. కొన్ని సార్లు పొరపాట్లు జరుగుతుంటాయి. మరి వాటిని సరిదిద్దుకుని వంటల రుచులను పెంచుకోవడం ఎలానో చూడండి...
వంటకాల్లో నూనె/ నెయ్యి ఎక్కువైతే దాన్ని కాసేపు ఫ్రిజ్‌లో పెట్టండి. అప్పుడు నూనె గ్రేవీపై పేరుకుంటుంది. ఇంకేముంది దాన్ని గరిటెతో సులభంగా తొలగించవచ్చు.
* పకోడీలు కరకర లాడకపోతే బజ్జీల పిండిలో ఒకట్రెండు చెంచాల బియ్యప్పిండి కలిపి చూడండి.
* సెనగలను ఉడికించిన నీటిని పారబోయకుండా చపాతీ పిండి తడపడానికి వాడొచ్చు.
* సేమ్యా హల్వా మరింత రుచిగా రావాలంటే చెంచా సెనగపిండి కలపాలి.  
* ఖీర్‌, పాయసం లాంటివి చేసేటప్పుడు చిటికెడు ఉప్పు కలిపితే రుచి పెరుగుతుంది.
* అన్నం అడుగు అంటకుండా ఉండాలంటే దానిలో చెంచా నెయ్యి, కొన్ని చుక్కల నిమ్మరసం కలిపితే సరి. అన్నం తెల్లగా, పొడిపొడిగానూ అవుతుంది.
* గ్రేవీ రుచి పెరగాలంటే... మసాలా దినుసులను వేయించేప్పుడు అర చెంచా చక్కెర జత చేసి చూడండి. చక్కటి రంగుతోపాటు రుచి రెండింతలవుతుంది.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్