నాకిప్పుడు మూడో నెల.. వ్యాక్సిన్ వేయించుకోవాలా?వద్దా?
ప్రమాదకర జబ్బుల బారినపడకుండా గర్భిణులకు వైద్యులు వ్యాక్సిన్లు ఇస్తారు. ఉదాహరణకు ప్రతి గర్భిణికి టెటనస్, ఫ్లూ, టీడాప్ (టెటనస్, డిఫ్తీరియా కోరింత దగ్గు) వ్యాక్సిన్లు తప్పనిసరిగా వేస్తారు. వీటివల్ల ఆమె గర్భంలో పెరిగే శిశువుకు కూడా రక్షణ లభిస్తుంది. బిడ్డ పుట్టిన తర్వాత వ్యాక్సిన్ వేసే వరకూ ఈ రక్షణ ఉంటుంది. కొవిడ్ ప్రబలుతున్న ఈ విపత్కర సమయంలో గర్భవతులు, పాలిచ్చే తల్లులను రక్షించుకోవడం...
నాకిప్పుడు మూడో నెల. నేను కొవిడ్ వ్యాక్సిన్ వేయించుకోవచ్చా?
- ఓ సోదరి
ప్రమాదకర జబ్బుల బారినపడకుండా గర్భిణులకు వైద్యులు వ్యాక్సిన్లు ఇస్తారు. ఉదాహరణకు ప్రతి గర్భిణికి టెటనస్, ఫ్లూ, టీడాప్ (టెటనస్, డిఫ్తీరియా కోరింత దగ్గు) వ్యాక్సిన్లు తప్పనిసరిగా వేస్తారు. వీటివల్ల ఆమె గర్భంలో పెరిగే శిశువుకు కూడా రక్షణ లభిస్తుంది. బిడ్డ పుట్టిన తర్వాత వ్యాక్సిన్ వేసే వరకూ ఈ రక్షణ ఉంటుంది. కొవిడ్ ప్రబలుతున్న ఈ విపత్కర సమయంలో గర్భవతులు, పాలిచ్చే తల్లులను రక్షించుకోవడం చాలా అవసరం. ఈ విషయాల్లో మార్గదర్శకాలను నిర్దేశించే పదికి పైగా జాతీయ వైద్య సంఘాలన్నీ గర్భిణులందరికీ కొవిడ్ వ్యాక్సిన్ ఇవ్వాలని సిఫార్సు చేస్తున్నాయి. అయితే కేంద్ర ప్రభుత్వం మాత్రం ఇంతవరకు దీనిపై స్పష్టమైన సూచనలు ఇవ్వలేదు. ఇప్పటికే అమెరికా, చైనా, యూరప్ దేశాలన్నీ గర్భిణులకు కొవిడ్ టీకా ఇస్తున్నాయి. అయితే అక్కడి వ్యాక్సిన్ల రకం పూర్తిగా వేరు. మన దేశంలో ఇస్తున్న రెండు (కొవాగ్జిన్, కొవిషీల్డ్) వ్యాక్సిన్లు గర్భిణులపై ఎంత వరకు, ఎలా పనిచేస్తాయనే దానిపై ఇంతవరకు అధ్యయనాలు జరగలేదు కాబట్టి ప్రభుత్వం ఇంకా సూచనలు జారీ చేయలేదు. మన వ్యాక్సిన్లు రెండూ ఫ్లూ వ్యాక్సిన్‌ను పోలి ఉన్నాయని చెబుతున్నారు. ఈ ఫ్లూ వ్యాక్సిన్ గర్భవతులకు సురక్షితమని తెలియడం వల్ల, వ్యాక్సిన్ కంటే కొవిడ్ వైరస్ ఎన్నో రెట్లు ప్రమాదకరం కావడం వల్ల ఎక్కువ శాతం మంది వైద్యులు గర్భిణులకు వ్యాక్సిన్ తీసుకోమని చెబుతున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.