Published : 08/07/2021 00:36 IST

ఆయన ఆత్మహత్య చేసుకున్నాడు ఆస్తి వస్తుందా?

మాది పేద కుటుంబం. కట్నం లేకుండా పెళ్లి చేసుకున్నారు. నా మీద పెత్తనం చేయాలనుకునే ఆడపడుచులు, అత్తలతో కొద్దిరోజులకే గొడవలు మొదలయ్యాయి. దాంతో నాకూ మావారికీ¨ మధ్య దూరం పెరిగింది. నేను పుట్టింటికి వచ్చేశా. తర్వాత ఆయన ఆత్మహత్య చేసుకున్నారు. ఇక నేనెప్పుడూ అత్తింటికి వెళ్లలేదు. అప్పటి నుంచి ఒంటరిగానే ఉంటున్నా. ఇటీవల మా అమ్మా నాన్నా చనిపోయారు. నాకే ఆధారమూ లేదు. నా భర్త పేరు మీద మూడెకరాల పొలం ఉంది. అది నాకు వస్తుందా? నేను కోర్టులో కేసు వేయొచ్చా? - ఓ సోదరి

మీ భర్త ఆత్మహత్యకు మీరు కారణం అని ఎక్కడైనా నిరూపణ అయ్యిందా? అంటే మీ మీద కేసు పెట్టడం లాంటివేమైనా జరిగాయా? హిందూ వివాహచట్టం-1956లోని సెక్షన్‌ 10 ప్రకారం చనిపోయిన వ్యక్తి పేరు మీద ఉన్న ఆస్తి... భార్య, అతని పిల్లలు, తల్లికి సమాన భాగాలుగా వస్తాయి. అయితే ముందు మీరు చట్టబద్ధ వారసురాలిగా నిరూపించుకోవాలి. అందుకు మీరు కుటుంబ వారసత్వ ధ్రువపత్రం కోసం దరఖాస్తు చేసుకోవాలి. లేదా కోర్టు ద్వారా ఆ ధ్రువపత్రం పొందడానికి ఒరిజినల్‌ పిటిషన్‌ సిటీ సివిల్‌ కోర్టు పరిధిలో దాఖలు చేసుకోవాలి. మీ దగ్గరున్న పెళ్లి ఆధారాలు కోర్టుకు సమర్పించి వారసురాలిగా నిరూపించుకోవాలి. విడాకులు తీసుకోలేదని, మీ భర్త చావుకి మీరు కారణం కాదని నిరూపించాలి. అంటే కేవలం అతడి మానసిక స్థితి సరిగా లేకో మరే ఇతర కారణంతోనో ఆత్మహత్య చేసుకున్నాడని నిరూపణ అయితే... మీకు సగం ఆస్తి అయినా దక్కుతుంది. ఇక్కడ మీ భర్తకు ఆస్తి ఎలా సంక్రమించిందో కూడా పరిశీలించాలి. ఒకవేళ అది భాగాలుగా పంచిన ఆస్తి కాకుండా... ఇంకా మీ మామగారి పేరు మీదే ఉంటే మీకు రావడం కష్టం. ముందు ఆస్తికి సంబంధించిన కాగితాలు, మీ భర్త మరణ ధ్రువీకరణ పత్రం, పెళ్లి పత్రాలు, ఫొటోలు వంటివన్నీ రుజువులుగా చూపించి ఆస్తిని మీ పేరు మీదకు మార్పించుకోవడానికి ఆర్‌డీవో లేదా ఎంఆర్‌వోకి దరఖాస్తు చేయండి. ఒకవేళ వారు ఏ కారణాల వల్లనైనా తిరస్కరిస్తే... అప్పుడు కోర్టు ద్వారా వారసత్వ సర్టిఫికెట్‌ పొందడానికి ప్రయత్నించండి. మంచి లాయర్‌ని కలిసి కాగితాలు చూపిస్తే నిజానిజాలు తెలుస్తాయి.


Advertisement

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

మంచిమాట


'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్